Movies

శారద కన్నీళ్లు చూడలేక ఎన్టీఆర్ ఏమి చేసాడో తెలుసా?

సామాన్య ఆడవాళ్లే కాదు,సెలబ్రిటీలుగా నిల్చిన ఆడవాళ్లు సైతం తమ ఇళ్లల్లో వేధింపులు,భర్తల నుంచి అనుమానపు అగచాట్లు పడ్డవాళ్ళు ఉన్నారు. అందులో సినీ నటి శారద ఒకరు. నిత్యం అనుమానంతో వేధిస్తూ,నరకం చూపించడంతో చలం తో విడిపోయిన శారద ఆతర్వాత మరో మగాడిని కూడా కన్నెత్తి చూడ్డానికి భయపడిందట. అంతగా చలం ప్రవర్తన ఆమె మనసుపై ప్రభావం చూపింది. ఇటీవల సాయికుమార్ తనయుడు అది నటించిన సుకుమారుడు మూవీలో బామ్మ గా శారద కనిపిచ్చింది. ప్రస్తుతం తన సోదరుని ఇంట ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న శారద ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించి,తరువాత కాలంలో క్యారెక్టర్ యాక్టర్ గా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా , తల్లిగా, గడసరి అత్తగా ఇలా పాత్రలతో తన నట విశ్వరూపం ప్రదర్శించింది.

మళయాళ సినిమాల్లో కూడా నటించింది. జాతీయ ఉత్తమ నటిగా నిల్చింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శారద ఒకప్పుడు టిడిపి ఎంపీగా చీరాల నుంచి గెల్చింది. ఇక ప్రస్తుతం సినిమాలకు,రాజకీయాలకు దూరంగా ఉంటున్న శారద సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. పాలకొల్లులో కడుపేదరికంలో పుట్టిన చలం పూర్తి పేరు కొరడా సింహాచలం. మిఠాయి కొట్లో పనిచేసేవాడు. నాటకాలంటే పిచ్చి వలన పగటి పూట కొట్లో పనిచేసి,రాత్రిళ్ళు నాటకాల్లో నటించేవాడు.

ఇక నాటకాల్లో పేరు రావడంతో వారం రోజులపాటు షాప్ కట్టేసి చలం ను తీసుకుని కొట్టు యజమాని మద్రాసు వచ్చి సినిమాల్లో వేషం కోసం తిరగడంతో నా చెల్లెలు అనే మూవీతో చలం ఎంట్రీ ఇచ్చాడు. సంబరాల రాంబాబు,మట్టిలో మాణిక్యం,బుల్లమ్మా బుల్లోడు వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రమణకుమారి అనే మహిళతో పెళ్లయిన చలం తనపేరుని రమణాచలం గా మార్చుకున్నాడు. అయితే 1964లో చనిపోవడంతో ఊర్వశి శారదను రెండో పెళ్లి చేసుకున్నాడు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శారద కన్యాశుల్కం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత నాటక రంగానికి వెళ్లి, తమిళంలో రక్తకన్నీరు లో నటించడం ద్వారా పేరు తెచ్చుకుంది. ఎల్వి ప్రసాద్ దగ్గర నటించకపోయిన ఆయన దగ్గర శిక్షణ తీసుకుంది. అక్కినేనితో ఇద్దరు మిత్రులు లో నటించి ఆతర్వాత తండ్రులు కొడుకులు అనే మూవీలో నటించింది. ఇక ఆ సినిమాతో ఏర్పడ్డ పరిచయం చలంతో పెళ్లి వరకూ వెళ్ళింది. అయితే వీళ్ళ మధ్య ప్రేమాభిమానం కన్నా అనుమానాలే బలపడ్డాయి.

చలం చూడ్డానికి అమాయకంగా కనిపించినా,శారద మీద అనుమానం ఎక్కువే. తాగేసి వచ్చి కొట్టేవాడు. సినిమా షూటింగ్ లకు సైతం వెళ్లి కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ తో కల్సి ఏవిఎం స్టూడియోలో శారద నటిసున్న సమయంలో చలం అక్కడికి వచ్చి శారద మేకప్ రూమ్ కి వెళ్లి కొట్టేసాడట. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ అక్కడికి చేరుకొని చలం చెంప చెళ్లుమనిపించాడట. ఇక అక్కడ నుంచి కొన్నాళ్ళు బానే ఉన్నా ఆతర్వాత షరా మామూలే. ఇక అన్నం లేకున్నా పర్వాలేదు కానీ అనుమానపు మొగుడితో వేగడం కష్టమని భావించి, చలంతో విడాకులు తీసుకుంది.