Movies

హీరో సుమంత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

1) అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి మరియు సురేంద్ర దంపతులకు సుమంత్, ఫిబ్రవరి 9, 1975 హైదరాబాద్ లో జన్మించాడు.

2) ‘శివ’, ‘గాయం’, ‘రాముడొచ్చాడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలను సుమంత్ తండ్రి సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

3) సుమంత్, కింగ్ నాగార్జునకి మేనల్లుడు. సుశాంత్, రానా, నాగ చైతన్య, అఖిల్ లు కజిన్స్ అవుతారు.

4) సుమంత్ అక్క సుప్రియ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ తో కలసి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో నటించింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటుంది.

5) నటి కీర్తి రెడ్డిని 2004 లో పెళ్లాడిన సుమంత్ .. ఇరువురి అంగీకారంతోనే 2006లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి సుమంత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

6) సుమంత్, తన యాక్టింగ్ కెరీర్ ను రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమ కథ’ చిత్రం ద్వారా సినీ అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో పాటుగా నంది అవార్డులను తెచ్చిపెట్టింది.

7) రెండవ సినిమా కరుణాకరన్ దర్శకత్వంలో ‘యువకుడు’ సినిమాలో నటించాడు. భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

8) తాతతో కలసి ‘పెళ్లి సంబంధం’ అనే సినిమా లో నటించాడు సుమంత్. మామ తో కలసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేశాడు.
Akkineni nageswara rao and sumanth
9) 2003లో వచ్చిన ‘సత్యం’ సినిమా సుమంత్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పేరుగాంచింది.

10) ‘గౌరి’, ‘పౌరుడు’, ‘మహానంది’, ‘ధన 51’ సినిమాలు నిరాశపరిచినా ‘గోల్కొండ హైస్కూల్’ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

11) ‘మళ్ళిరావా’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సుమంత్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
Sumanth and Keerthi Reddy
12) ప్రస్తుతం వైవిధ్యభరిత చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ‘సుబ్రమణ్య పురం’, ‘ఇదంజగత్’ సినిమాలే అందుకు నిదర్శనలు.

13) తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.