Devotional

హోలీ పండుగ జరుపుకోవటానికి గల కారణాలు ఏమిటో తెలుసా?

హోలీ పండుగ జరుపుకోవటానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశపుడు ఒక రాక్షస రాజు . ఎప్పుడు విష్ణు చింతనలో ఉండే కొడుకు ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయించుకొని ఒకరోజు హిరణ్యకశపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకున్న వరంతో ప్రహ్లాదుణ్ణి మంటలకు ఆహుతి చేయమని చెప్పుతాడు. ఆ హోలీక తన సోదరుని కోరిక తీర్చడానికి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ విష్ణుమాయవల్ల హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవుడై నిలిచాడు. హోలిక దహనమైన రోజు కనుక హోలీపండుగను చేసుకొంటారు.

పూర్వం రోజులలో ఈ పండుగ రోజు అనేక రకాల పూవులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి సంతోషాన్ని,ఆనందాన్ని పంచుకొనేవారట. అది రానురాను పూవుల స్థానంలో రకరకాల రంగులు వచ్చిచేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకొంటారు. ఇలా చల్లుకోవడం వల్ల ప్రేమతో పాటు సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు.

కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. అతను ప్రజలను కన్నా బిడ్డలా వాలే చూసుకుంటూ జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కొంత మంది ప్రజలు వచ్చి రాజుతో హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మోర పెట్టుకుంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి హోళిక అనే రాక్షసిని ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజిస్తే పిల్లలను ఏమి చేయదని చెప్పుతారు. దాంతో రాజు రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశిస్తాడు.

రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ ….. హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది.