శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏ రంగంలో ఉండేదో తెలుసా?హీరోయిన్ గా ఎలా టర్న్అయిందో తెలుసా?
తండ్రి కమల్ హాసన్ వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతిహాసన్ తెలుగు,తమిళ ,హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1986జనవరి 28న కమల్ హాసన్,సారిక దంపతులకు జన్మించారు. శృతికి అక్షర హాసన్ అనే చేల్లెలుంది. ప్రస్తుతం కమల్ తమిళనాట రాజకీయ పార్టీ పెట్టాడు. కమల్ ,సారిక లది ప్రేమ వివాహం. చెన్నైలో ఇంటర్ వరకూ చదువుకున్న శృతి ముంబయి కాలేజీలో సైకాలజీ పట్టా అందుకుంది. అందుకే ఆమె ఎవరు ఏమనుకుంటున్నారో ఫేస్ చూసి చెప్పేస్తుంది. చిన్ననాటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం కావడంతో చదువు అయ్యాక కాలిఫోర్నియాలో మ్యూజిక్ నేర్చుకుంది. షూటింగ్ లేని సమయంలో బుక్స్ చదవడం,స్విమ్మింగ్ చేయడం ఆమెకు ఇష్టం. తమన్నా ,శృతి చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
ఇక రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్, మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వచ్చాయి. 2000 సంవత్సరంలో మహాత్మాగాంధీ హంతకుడు హేరామ్ సినిమాలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కూతురు పాత్రలో శృతి బాలనటిగా చేసింది. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె కోరికను తల్లి సారిక,తండ్రి కమల్ హాసన్ ఒప్పుకోవడంతో ఇండస్ట్రీలోకి సులువుగా ఎంట్రీ ఇచ్చింది.
2008లో లక్స్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసి ఘోర పరాజయం చవిచూసింది. ఇక సంగీతంపై దృష్టి పెట్టడంతో మల్లికా షరావత్ నటించిన ఈష్ అనే మూవీలో శృతి ఓ సాంగ్ పాడింది. తర్వాత ఈనాడు తదితర చిత్రాల్లో పాటలు పాడింది. అవార్డులు కూడా అందుకుంది. మొత్తం మీద మూడేళ్లపాటు సినిమాల్లో నటించకుండా ఉండిపోయిన శృతి ఇక 2011లో కె రాఘవేంద్రరావు కొడుకు కె ప్రకాష్ రావు దర్శకత్వంలో హీరో సిద్ధార్ధ్ సరసన అనగనగా ఓ ధీరుడు మూవీలో నటించింది. సినిమా ఆడలేదు.
అయితే ఉత్తమ నటి గా భారత ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు తమిళ భాషల్లో వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా భారీ విజయం అందుకుంది. ఇందులో ఓ పాట కూడా పాడేసింది. ధనుష్ సరసన త్రి అనే మూవీలో నటించి తన తొలి రొమాంటిక్ నటనతో యూత్ మనసు కొల్లగొట్టింది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. రవితేజతో బలుపు,తారక్ సరసన రామయ్యా వస్తావయ్యా,రేసుగుర్రంలో బన్నీ సరసన,అలాగే ఎవడు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు సరసన నటించి పేరుతెచ్చుకుంది. ఈ సినిమాతో పాటు గతంలో నటించిన రేసుగుర్రం,గబ్బర్ సింగ్ , ఆగడు సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది. కాటంరాయుడు,ప్రేమమ్ మూవీస్ లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.