ఉగాది నుండి ఈ రాశులవారు అపర కుబేరులు కాబోతున్నారు….. మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులు
2020 వ సంవత్సరం మార్చి 25 శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది . తెలుగు వారికి కొత్త సంవత్సరం ఈ ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది నుండి గ్రహ స్థితుల కారణంగా ఏ రాశులవారికి రాజయోగం పడుతుందో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది నుండి 4 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది .
వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఈ రాశుల వార్ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. పెళ్లి కానివారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రాశులవారికి బాగా కలిసి వస్తుందో వివరంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశివారు ఇప్పటివరకు మంచి ఉన్నత స్థితిలో ఉన్నా ఈ ఉగాది నుండి ఇంకా మంచి స్థితికి చేరతారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో ఈ రాశివారు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయటమే కాకుండా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఈ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూలమైన తీర్పు వస్తుంది. సొంత ఇంటి ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. వీరికి వచ్చే అవకాశాలను సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకుంటే ఈ రాశివారికి అసలు తిరుగుండదు. వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.
వృశ్చిక రాశి
శ్రీ వికారి నామ సంవత్సరంలో ఈ రాశివారు ఏ పనిని మొదలు పెట్టిన విజయం సాధిస్తారు. గత 6 సంవత్సరాల నుండి ఉన్న శని ప్రభావం తొలగిపోవడంతో ధనాన్ని బాగా సంపాదిస్తారు. ఈ రాశివారు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి. వీరు ఏమి చేసిన విజయం వీరి వెంట ఉంటుంది. వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తీ అయ్యేవరకు నిద్రపోరు. అంత పట్టుదలగా పనులను పూర్తి చేస్తారు.
సింహ రాశి
12 రాశులలో శక్తివంతమైన రాశి సింహ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. గ్రహాలకు అధిపతి అయినా సూర్యుడు సింహ రాశివారికి రాజయోగం కల్పించబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఈ రాశివారికి ఒక్క అవకాశం వస్తే చాలు, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. ఈ రాశివారు అనుకున్నది సాధించేవరకు మిశ్రమించరు. కుటుంబ సభ్యుల మద్దతు,ప్రోత్సాహం ఎక్కువగా ఉండుట వలన చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంటిలో ప్రశాంతమయిన వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు ఏ పని చేసిన విజయం వీరినే వరిస్తుంది.
మీన రాశి
ఈ రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది నుండి గురు గ్రహ ప్రభావంతో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశివారికి వెంట విజయం ఎప్పుడు ఉంటుంది. వృతి,వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశివారు ఏ పని చేసిన బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి సమయం అని చెప్పాలి. కుటుంబంలో కూడా శాంతిపూరిత వాతావరణం ఉంటుంది.