Movies

రాఘవేంద్ర రావు B.A సెంట్ మెంట్ వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా?

కమర్షియల్ టచ్ తో సినిమాలు తీయడంలో దిట్ట గా, ముఖ్యంగా కలర్ ఫుల్ గా పాటలు చిత్రీకరించడంలో మేటిగా ముద్రపడిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ఎన్టీఆర్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,బాలకృష్ణ,అల్లు అర్జున్ ఇలా చాలామంది హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందించాడు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రాఘవేంద్రరావు బిఎ అని అప్పట్లో వాల్ పోస్టర్ కనిపిస్తే చాలు ఆ సినిమా హిట్ ఖాయం అన్నట్లు ఉండేది.

అయితే పేరు చివర బిఎ వేసుకోవడం వెనుక పెద్ద హిస్టరీ ఉందట. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావు వెల్లడించాడు. అప్పట్లో బిఎ చదివితే ఏ ఉద్యోగం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే డ్రైవర్ కి వచ్చే జీతం కూడా రాదు. ఇక రెండు సినిమాలకు పేరు పక్కన బిఎ వేసుకుంటే హిట్ అయ్యాయట. అయితే ఓ సినిమా లో మాత్రం పేరు పక్కన ఆ రెండు అక్షరాలు మిస్ అయ్యాయి. అలా ఎందుకు అయిందో రాఘవేంద్రరావుకు తెలీదట. దీంతో అది కాస్తా ప్లాప్ అయింది. అప్పుడు పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ దృష్టికి పేరు వెనుక బిఎ సెంటిమెంట్ అని చెప్పడంతో ఆతరవాత చిత్రంలో వేసారట.

దాంతో బిఎ అని వేసిన సినిమా ఆడడంతో ఇక అక్కడి నుంచి క్రమం తప్పకుండా బిఎ డిగ్రీ వేస్తూ వచ్చారట. అలా మొత్తానికి బిఎ సెంటిమెంట్ అయిందని చెప్పిన రాఘవేంద్రరావు,ఒకవేళ డైరెక్టర్ గా సక్సెస్ కాకపోయి ఉంటే ఐదువేలు జీతానికి పనిచేయాల్సి వచ్చేదని అప్పుడు చెక్కుతో అసలు పనే ఉండేది కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. ఇక డ్రైవింగ్ వచ్చు కనుక డ్రైవర్ అయ్యేవాడిని అని వ్యాఖ్యానించారు.