Movies

టాలీవుడ్ లో కొత్త మోజు.. ఈ ముగ్గురికీ ఒకే పోలిక…ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

కథ డిమాండ్ చేస్తే హీరోగానే కాదు.. విలన్ గా అయినా మెప్పిస్తాం అంటున్నారు మన హీరోలు. ఎప్పుడూ ఒకటే ఫాలో అయితే ఎట్లా.. అప్పుడప్పుడు ఛేంజ్ అవ్వాలి అనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు. అందుకే వినూత్న ప్రయత్నాలతో ప్రేక్షకుల మనస్సును గెలుచుకుంటున్నారు.ఇన్నాళ్ళుగా హీరోయిజం చూపించి బోర్ కొట్టిన స్టార్ హీరోలు ఇక మీదట విలనిజంకు రెడీ అయిపోతున్నారు. వారు ఎవరో చూద్దాం.

ఎన్టీఆర్

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న రేంజే వేరు. ఆయన డాన్సులకు ఫిదా అవ్వనివారుండరు. ఇక తారక్ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూసే అభిమానులు కోట్లలో ఉన్నారు. స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ.. అతి తక్కువకాలంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఎన్టీఆర్ ను సాధారణంగా హీరోగానే ఉహించుకుంటాం. ఈయన అలాగే సినిమాలు చేసుకుంటూ కూడా వెళ్లొచ్చు. కానీ ‘జై లవ కుశ’ చిత్రంలో విలన్ గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మొదటినుండీ కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్న మెగా ప్రిన్స్.. ఈసారి కూడా కొత్తదనంతోపాటుగా, కొత్త పాత్రలను చేయడానికి సిద్ధపడుతున్నాడు. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్, తాజాగా విలన్ పాత్రపై మోజు పడినట్లు తెలుస్తుంది. అందుకే తన తదుపరి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సెలక్ట్ చేసుకున్నాడు.

నాని

సహజ నటనకు పెట్టింది పేరు నాని. అందుకే న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు. నాని ‘జెంటిల్ మ్యాన్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెల్సిందే. హీరోగా ఎంత న్యాచురల్ గా చేసాడో.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అంతే మెప్పించి ప్రేక్షకుల నుండి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని తరువాతి సినిమాలో కూడా విలన్ గా కనిపించబోతున్నాడట.