అత్తారింటికి దారేది సీరియల్ లో నటించిన పల్లవి గురించి కొన్ని నమ్మలేని నిజాలు
బుల్లితెర రంగంలో ఎందరో నటీనటులు తమ ప్రతిభతో రాణిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. అందులో పల్లవిని ప్రధానంగా చెప్పుకోవాలి. అత్తారింటికి దారేది సీరియల్ లో ఈమె నటించకపోవడం వలన ఆడియన్స్ ఆ సీరియల్ చూడడం లేదంటే ఆమె ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. పల్లవి పూర్తి పేరు రామిశెట్టి పల్లవి. కృష్ణా జిల్లా అవనిగడ్డ లో జన్మించిన ఈమెను బుల్లితెర అనుష్క అని కొందరు,మరి కొందరు అలేఖ్య అని పిలుస్తారు. హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ చదివిన పల్లవి తన ఫ్రెండ్స్ కారణంగా సీరియల్ లో నటిగా మారిందని చెప్పవచ్చు. ఆడపిల్ల సీరియల్ నుంచి ఆమెను ఆడియన్స్ ఫాలో అవుతున్నారు.
అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంటుందని ఫాన్స్ మెచ్చుకుంటారు. ఇక ఆమెకు గడ్డం కింద చిన్న సొట్ట ఉండడమే ఆమె అందానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా చెబుతారు. భార్యామణి సీరియల్ తో పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కూతురు,భార్య,సిస్టర్ ఇలా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించే పల్లవి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని బుల్లితెర ఆడియన్స్ వ్యాఖ్యానిస్తున్నారట.
ఇక సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుందని,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో ఫ్యామిలీ ఎంటర్ టైం మెంట్ మూవీ తీయాలని పల్లవి ఫాన్స్ అంటున్నారు. ఆడదే ఆధారం సీరియల్ లో అమృత,అర్చన,అర్పిత,అమూల్య అనే నాలుగు డిఫరెంట్ రోల్స్ తో పల్లవి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఇక అత్తారింటికి దారేది సీరియల్ లో కృష్ణవేణి పాత్రకు పల్లవి తప్ప ఎవరూ సూటవ్వరని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆమెను ఆ సీరియల్ నుంచి తొలగించడంతో మొత్తం సీరియల్ ని పల్లవి ఫాన్స్ చూడ్డం మానేశారంటే ఆమె రేంజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. వ్యక్తిగత కారణాల వలన పల్లవి ఇందులో చేయడం లేదని తెలుస్తోంది.
అందుకే పల్లవి మళ్ళీ ఈ సీరియల్ లోకి రావాలని ఫాన్స్ అడుగుతున్నారు. సావిత్రి, సౌందర్య ల మాదిరినా నేచురల్ గా పల్లవి నటిస్తుందని ,ఇక ఆమె నవ్వు స్వీటీ అనుష్కలా ఉంటుందని చాలామంది చెప్పేమాట. రెండు జడలు వేసుకోడానికి ఈమె ఎక్కువ ఇష్టపడుతుందట. ఎందుకంటే మాటే మంత్రం సీరియల్ లో రెండు జడలు వేసుకోవడం ద్వారా మంచి గుర్తింపు పొందిన పల్లవి అదే సీరియల్ లో లంగా ఓణీతో దర్శనమిస్తోంది.