ఎన్నికల అఫిడవిట్‌లో ‘క్యాస్ట్ కాలమ్’.. పవన్ ఏం రాశారో తెలుసా?
జనసేన అధినేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఎన్నికల బరిలోకి దిగి అసెంబ్లీ అభ్యర్థిగా రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అన్న చిరంజీవి బాటలోనే రెండు స్థానాల్లో బరిలోకి దిగుతూ.. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు.
ఎన్నికల అఫిడవిట్‌లో తన కులాన్ని ప్రస్తావించలేదు. ఆ కాలమ్ ని ‘నాట్ అప్లికబుల్’ అంటూ పూర్తి చేసారు పవన్ కళ్యాణ్. తనది ఏ కులమో చెప్పడానికి నిరాకరించారు. కుల, మతాలకు అతీతమంటున్న పవన్ కళ్యాణ్.. తన కులాన్ని ప్రస్తావించకుండా కొత్త శకాన్ని ప్రారంభించారని అభిమానులు అంటున్నారు.