కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఆదిత్య అసలు గుట్టు ఇదే… బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
ఈటీవీలో ప్రసారమైన ఆడదే ఆధారం సీరియల్ లో మిక్కిగా కనిపించిన ఆదిత్య అందులో చాలా గెటప్స్ వేసాడు. ఇక కార్తీక దీపం సీరియల్ లో ఆనందరావు , సౌందర్య ల రెండో కొడుకుగా కనిపించే ఆదిత్య అసలు పేరు యస్వంత్.ఇతడి ముద్దు పేరు యష్ . ఇక ఇతను జూన్ 7న పుట్టాడు. ఇతడు చేసిన ఏదో మాయలా అనే షార్ట్ ఫిలిం హైప్ తీసుకొచ్చింది.2015ఫిబ్రవరిలో విడుదలైన ఈ షార్ట్ ఫిలింని 9 ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ షార్ట్ ఫిలిం 2మిలియన్స్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. అపర్ణ, సతీష్,అమృతరావు సంగీతం అందించారు. ఈ షార్ట్ ఫిలిం చూస్తే 24 క్రాఫ్ట్స్ చూసినట్లు ఉంటుంది. ఐడియా ఉంటె చాలని ఈ షార్ట్ ఫిలిం రుజువుచేసింది.
ఇక అష్టాచెమ్మా సీరియల్ లో అంజలికి భర్తగా నటించాడు. రాధాగోపాళం,శ్రీనివాస కళ్యాణం,అభిషేకం సీరియల్స్ లో కూడా నటించిన ఆదిత్య, తెలుగులో మంచు కురిసేవేళలో ,గ్రీన్ కార్డు,సమీరం,వంటి మూవీస్ లో చేసాడు. నాతిచరామి, లవ్ ప్రపోజల్స్ అనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో విడుదలైన సమీరం మూవీలో రామ్ గా ఆదిత్య కనిపిస్తే,సమీరగా అమృత ఆచార్య నటించింది. మధుసూదన్ డైరెక్షన్ చేసాడు. ఎలాంటి పాత్ర వేసిన తన స్మైల్ అదిరిపోతోంది
ఏదైనా సినిమా అంటే ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఉంటారు. కానీ ఆదిత్య నటించిన ఓ సినిమాకు ఏకంగా 65మంది నిర్మాతలుగా ఉన్నారు. నిజానికి బడ్జెట్ పరంగా కాకుండా ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాకపోతే అందరూ కల్సి సినిమా కంప్లిట్ చేసారు. కార్తీక దీపం సీరియల్ లో మొదటి హీరోగా కార్తీక్ నటిస్తే, రెండో హీరోగా ఆదిత్య దర్శనమిస్తాడు.
ఈ సీరియల్ లో అన్నా వదినలు విడిపోవడంతో ఎలాగైనా ఒక్కటి చేసి ఇంటికి తీసుకురావాలని ఆదిత్య తపిస్తాడు. ఇతడి భార్య గా సంగీత కామత్ నటిస్తోంది. ఈ సీరియల్ లో శ్రావ్య మారిపోయి ఆదిత్యతో బాగుండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇతడి ఫ్యాన్సీ నెంబర్ 2313. రెడ్ కలర్ అంటే ఇష్టపడతాడు.