కార్తీక దీపం సీరియల్ ఫెమ్ హిమ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…. ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా?
వెండితెర కన్నా బుల్లితెరమీద మంచి పాపులారిటీ వస్తోంది. అందుకే సీరియల్ లో నటీనటులకు క్రేజ్ వస్తోంది. డైరెక్ట్ గా కనెక్ట్ అయిన ఫీలింగ్ తో ఆడియన్స్ ఉండడమే దీనికి కారణం. ఇక కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ కూతురుగా, ఆనందరావు , సౌందర్య ల మనవరాలిగా కనిపించే హిమ అసలు పేరు సహృద. ఈమెకు ఫ్రూటీ అనే ముద్దు పేరుంది. యాక్టివ్ గా ఉంటూ డాన్స్ అదరగొట్టే హిమ పుట్టినరోజు సెప్టెంబర్ 4. హిమ తల్లి పేరు మహి. కరీంనగర్ లో పుట్టి పెరిగింది. కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మహికి వరంగల్ లో జన్మించిన హిమ ప్రస్తుతం హనుమకొండలో ఫ్యామిలీతోనే ఉంటోంది.
తెలంగాణలోని కొత్త జిల్లా ములుగు లోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ లో చదువుతోంది. రియల్ లైఫ్ లో హిమ వైట్ కలర్ లో ఉంటుంది. పండుగలంటే ఇష్టపడే మహి 2018వినాయక చవితి సందర్బంగా తన ఫ్రెండ్స్ తో కల్సి 400మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి అందరి ప్రశంసలు అందుకుంది. స్వాతి చినుకులు సీరియల్ లో నటించే అర్చన,సహస్ర లు హిమకు మంచి ఫ్రెండ్స్ . యస్వంత్ మాస్టర్ తో కల్సి గంగోత్రిలో స్టెప్పులేసింది. 2017లో బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ లో అవార్డు గెల్చుకుంది.
ఒక సీరియల్ లో శీనయ్య, బేబీ కూతురుగా కనిపించిన హిమ , నాకోడలు బంగారం అనే సీరియల్ లో కూడా నటించింది. హిమకు ఆమె ఫ్రెండ్ సుస్మితకు అప్సర అవార్డులు వచ్చాయి. ప్రతి శనివారం రాత్రి 8గంటలకు ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ లో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ లో చేస్తోంది. అనసూయ,అలీ,ఓంకార్ జడ్జీలుగా ఈ షోకి వ్యవహరిస్తున్నారు. ఇక హిమ టాలెంట్ చూడాలంటే ఈ ప్రోగ్రామ్ చూసి తీరాలి. ప్రదీప్ మాచిరాజు అంటే హిమకు చాలా ఇష్టం . ఇక కొత్త సీరియల్ లో నటించేందుకు బిజీగా వుంది.