Movies

చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ మూవీలో మనకు తెలియని కొన్ని నమ్మలేని నిజాలు

టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే ఇప్పటికీ అగ్రస్థానం ఉంది. డాన్స్ లో ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసిన చిరంజీవిలో యాక్టింగ్ స్టైల్ కానీ.. కామెడీ టైమింగ్ కానీ.. డాన్స్ లో గ్రేస్ కానీ.. ఇవన్నీ కలసి ఆయన్ని నెంబర్ 1 పొజిషన్ కు తీసుకొచ్చాయి. క్రమశిక్షణ,అంకితభావం కలగలసిన మెగాస్టార్ నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా 80, 90 దశకాలలో చిరంజీవి చేసిన ఫిల్మ్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. ఆ టైం లో సక్సెస్ అన్న పదానికి ఆయన పర్యాయపదంగా మారిపోయారు. ఇక 1993, జనవరి 17న వచ్చిన ‘ముఠామేస్త్రి’ ఇప్పటికే 26 వసంతాలు పూర్తయ్యాయి.

ఇక ఈ సినిమాలో కొన్ని మరపురాని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, చిరంజీవి, దర్శకుడు కోదండరామి రెడ్డి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఖైది’, ‘అభిలాష’, ‘విజేత’, ‘కొండవీటి దొంగ’.. ఇలా ఎన్నో సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ‘ముఠామేస్త్రి’ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాలో చిరు పరిచయ గీతం “ఈ పేటకు నేనే మేస్త్రి” అప్పట్లో సూపర్ హిట్. యూత్ ను ఎక్కువగా ఉర్రూతలూగించింది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన మీనా, రోజాలు హీరోయిన్లుగా నటించారు. అయితే చిరంజీవి, రోజా కాంబినేషన్ లో ‘ముఠామేస్త్రి’ మూడో సినిమా. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ముఖ్యంగా ‘ఈ పేటకు నేనే మేస్త్రి’, ‘అంజనీ పుత్రుడా వీరాది వీరుడా’ అనే పాటలు ఎప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి అంటే దానికి సంగీత దర్శకుడు కోటి కారణం అని చెప్ప్పాలి.

ఈ సినిమాలో మొత్తం 6 పాటలకు గాను 5 పాటలను వేటూరి రాయగా, ఈ 5 పాటలను ఎస్. పి. బాలు ఆలపించారు. ఈ సినిమాకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఆవిధంగా ఇది చిరుకు నాలుగో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గా నిల్చింది. కాగా ముఠామేస్త్రి’ సినిమా హిందీ లో ‘కూలీ’ అనే పేరుతో డబ్ చేశారు.