రామ్ చరణ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు…. సినిమాల్లోకి రావటానికి అసలు కారణం ఇదే !
చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రంగస్థలంతో ఎంతో ఎత్తుకి ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కల్సి నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన వినయ విధేయ రామ మూవీ డిజాస్టర్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంటే మరోపక్క కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సైరా నరసింహారెడ్డి మూవీ భారీ వ్యయంతో తీస్తున్నాడు. 1985 మార్చి 27న మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులకు రామ్ చరణ్ చెన్నైలో జన్మించాడు. ఇతడికి సుస్మిత,శ్రీజ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చెన్నై బాలభవన్ స్కూల్ చదువుకున్నాడు. ఇంటర్ కూడా అక్కడే పూర్తిచేసి , ఆతర్వాత బికాం లో చేరిన చెర్రీ అది పూర్తిచేయలేదు. సెకండ్ ఇయర్ లో ఉండగానే సినిమాల్లో చేయాలన్న కోరిక పెరగడంతో లండన్ వెళ్లి యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాడు.
చిన్నప్పటినుంచి డీసెంట్ గా ఉండే చెర్రీ పరిశోధించడం అంటే చాలా ఇష్టపడేవాడు. ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ డాన్స్ లు వేస్తుంటే, తనకు వచ్చినప్పటికీ చెర్రీ సిగ్గుతో అలానే ఉండిపోయేవాడట. క్రికెట్ అంటే ఇష్టం గల చెర్రీ చాలాసార్లు క్రికెట్ ఆడి,కప్పులు కూడా గెల్చుకున్నారట. సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యాక 2011డిసెంబర్ 1న అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాసనతో నిశ్చితార్ధం అయింది.
ఏడాది పాటు అర్ధం చేసున్నాక 2012జూన్ 14న ఇద్దరికీ పెళ్లయింది. హీరోగా రాణిస్తూనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి ట్రూజెట్ ఎయిర్ లైన్స్ సంస్థను కొనుగోలు చేసారు. ఇక చిన్ననాటి నుంచి గుర్రపు స్వారీ అంటే అభిలాష కనుక ఇతరులకు కూడా నేర్పించాలన్న ఉద్దేశ్యంతో రైడింగ్ క్లబ్ స్థాపించి దాని ద్వారా యూత్ కి గుర్రపు స్వారీ నేర్పిస్తున్నారు.
హీరోలు శర్వానంద్ ,దగ్గుబాటి రానా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటినుంచి చిరంజీవి తో కల్సి షూటింగ్స్ కి వెళ్లినప్పటికీ సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం లేదంటూ. కార్స్ నడపడం అంటే ఇష్టం కావడంతో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి,యూరప్ లో ఉద్యోగం చేయాలనీ భావించినప్పటికీ,ఇంటికి వచ్చే నిర్మాతలు నీతో సినిమా ఎప్పుడు అని పదేపదే అడగడంతో తండ్రి వారసత్వం వైపు అడుగులు వేసాడు.
లండన్ లో శిక్షణ తీసుకున్నాక 2007లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత మూవీతో చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఉత్తమ నటుడుగా ఫిలిం ఫేర్ అవార్డు,స్పెషల్ జ్యురి నంది అవార్డు అందుకున్నాడు. ఇక 2009లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర రికార్డులు తిరగరాసింది. ఇతర దేశాల వారికి కూడా చెర్రీ పరిచయం అయ్యాడు. ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ ఆరెంజ్ ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రచ్చ మూవీతో మాస్ హీరోగా చెలరేగిపోయాడు.
ఆతర్వాత నాయక్ మూవీ తో మరింత రాణించాడు. రచ్చ, నాయక్ మూవీలకు ఉత్తమ నటుడుగా ఫిలిం ఫేర్ అవార్డు లు అందుకున్నాడు. అయితే బాలీవుడ్ లో పోలీస్ పాత్రతో చేసిన జంజీర్ చిత్రం ఆడలేదు. తుపాన్ మూవీ దెబ్బకొట్టగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఎవడు మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
గోవిందుడు అందరివాడేలే సినిమా 40కోట్ల క్లబ్ లో చేరింది. 2015లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో బ్రూస్ లీ లో నటించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర చతికిల బడింది. 2016లో దృవ మూవీతో విజయం అనుకున్న చెర్రీ, ఆతర్వాత రంగస్థలంలో నట విశ్వరూపంతో రెచ్చిపోయాడు. రంగస్థలం సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. జి సినిమా అవార్డు సొంతం చేసుకున్నాడు.