హీరో రామ్ గురించి షాకింగ్ విషయాలు….కెరీర్ లో ప్లాప్ లకు కారణం ఏమిటో తెలుసా?
వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ విభిన్న పాత్రలతో 16 చిత్రాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్ తో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. 15 ఏళ్ళ వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించిన రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రముఖ నిర్మాత “స్రవంతి” రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని, పద్మశ్రీ దంపతులకు 1987 మే 15 న రామ్ జన్మించాడు. రామ్ కి సోదరుడు కృష్ణ చైతన్య,సోదరి మధు స్మిత ఉన్నారు. హైదరాబాద్ లో పుట్టినప్పటికీ వారి కుటుంబం అతని చిన్నప్పుడే చెన్నైలో సెటిల్ అయింది.
దీంతో తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం సెంట్ జాన్ పాఠశాలలో పదవ తరగతి వరకూ చదివాడు. చిన్ననాటి నుంచి సినిమాల్లో చేయాలన్న కోరిక ఉండడంతో టెన్త్ అయ్యాక సినిమాల్లోకి వెళ్తానని చెప్పడంతో పేరెంట్స్ అతడిని ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేర్చగా ,ఏడాదిపాటు శిక్షణ పొందాడు. స్కూల్ చదివేటప్పుడు అందరితో కలివిడిగానే ఉంటూనే కొందరితో కూడా గొడవలు పడేవాడు. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ అవుతున్న సమయంలో పెదనాన్న స్రవంతి రవి కిషోర్ తో కల్సి రామ్ షూటింగ్ స్పాట్స్ కి వెళ్లేవాడట.
ఇంటికొచ్చాక డాన్స్ ,డైలాగులు ప్రాక్టీస్ చేసేవాడట. ఇనిస్టిట్యూట్ లో ఉండగా ఓసారి వైవిఎస్ చౌదరి అక్కడికి రావడం,అతడితో రామ్ కి పరిచయం ఏర్పడడంతో తన సినిమాలో చేయాలని కోరాడట. దీంతో 15ఏళ్ళ వయస్సులోనే రామ్ నూతన నటి ఇలియానా తో కల్సి హీరోగా దేవదాసు సినిమాలో చేసాడు. ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ – ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది.
తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం చిత్రం 2007 మార్చి 16 న విడుదలైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ మాస్ హీరోగా మంచి పేరు వచ్చింది. 2008 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించగా, ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.2009 లో బి.గోపాల్ దర్శకత్వంలో మస్కా సినిమా హిట్ కొట్టింది. హన్సిక, షీలా హీరోయిన్స్ గా చేసారు. అదే ఏడాది ఎం.శరవణన్ దర్శకత్వంలో గణేష్ చిత్రంలో చేయగా, కాజల్ అగర్వాల్ కథానాయిక గా నటించింది. అయితే గణేష్ పరాజయం పాలైంది.
2010 లో శ్రీవాస్ దర్శకత్వంలో రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించాడు. ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు గా నటించిన ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ చిత్రంలో హీరోయిన్స్ హన్సిక, అక్ష లతో కల్సి నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇక 2012 లో రామ్ ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే…ప్రేమంట! చిత్రంలో నటించాడు. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయంగా నిలిచింది కానీ రామ్, తమన్నాల నటన బాగుందన్న టాక్ వచ్చింది.
2013 లో భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఒంగోలు గిత్త చిత్రం పరాజయం పాలైంది. ఆ తరువాత కె. విజయభాస్కర్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి హిందీ చిత్రం బోల్ బచ్చన్ రీమేక్ మసాలా లో నటించాడు. అయితే అది కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.2015 లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన పండగ చేస్కో మూవీతో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.అదే ఏడాది శివమ్ అనే సినిమా చేసి ప్లాప్ అందుకున్నాడు.ఇక 2016 లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరం హైపర్ అనే సినిమా తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.
2017 లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగి అనే సినిమా లో నటించినా, నిరాశ పరిచింది. ఖాళీగా ఉన్న సమయంలో ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించే రామ్, కొన్ని సమయాల్లో ఫ్రెండ్స్ తో కల్సి టూర్స్ కి వెళ్తాడు. చిన్నతనంలోనే సినిమాల్లోకి రావడం వలన కాలేజీ జీవితం మిస్ అయ్యానని చెబుతాడు. అయితే సినిమాల్లోకి రావాలన్న లక్ష్యం మాత్రం నెరవేరిందని గర్వంగా చెబుతాడు. ఇక పెదనాన్న అయిన నిర్మాత రవికిశోర్ కుమారునితో కల్సి ప్రొడక్షన్ మొదలుపెట్టాలన్న ప్లాన్ లో ఉన్నట్లు రామ్ చెబుతున్నాడు.