Movies

మొగలి రేకులు సాగర్ కి ఎలాంటి అభిమానులున్నారో తెలుసా…. నమ్మలేని నిజాలు

వెండితెర కన్నా బుల్లితెర నటులకు పాపులారిటీ ఎక్కువగా ఉంటోందంటే దానికి కారణం రోజూ ప్రసారం అయ్యే సీరియల్ వలన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోవడమే. అమృతం సీరియల్ లో రెండే రెండు ఎపిసోడ్స్ లో కనిపించిన సాగర్ మొగలి రేకులు సీరియల్ తో పాపులర్ అయ్యాడు. అయితే చక్రవాకం సీరియల్ లో జగన్ పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది. మంజులా నాయుడు ద్వారా మొగలి రేకులు సీరియల్ లో దొరికిన ఛాన్స్ సాగర్ లభించిన గుర్తింపు తారాస్థాయికి చేరింది. ఈ సీరియల్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అదరగొట్టేసాడు. 1978ఆగస్టు 16న పుట్టిన సాగర్ కి 39ఏళ్ళు. ఐదడుగుల పది అంగుళాలు ఎత్తు గల సాగర్ తండ్రి సింగరేణిలో పనిచేసాడు.

బుల్లితెర ప్రభాస్ గా పిలుచుకునే సాగర్ అంటే వీరాభిమానం చూపేవాళ్లు కొందరు ఉన్నారట. ఒక క్యాబ్ డ్రైవర్ మున్నా అని పచ్చబొట్టు పొడి పొంచుకోవడం సాగర్ కి ఆశ్చర్యం వేసిందట. ఇక ఓ పెద్దాయనకు కేన్సర్ వచ్చిందట. ఆయన ను కల్సిన సాగర్ ని చూసి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందనడంతో ఇంతటి ఫాలోయింగ్ ఉందా అని సాగర్ పొంగిపోయాడట.

పైగా మొగలి రేకులు పూర్తయ్యే వరకూ ఉంటానులే అని ఆ పెద్దాయన చెప్పాడట. చెప్పినట్టే సీరియల్ అయ్యేవరకూ ఉన్నాక పోయారట. తర్వాత కాల్ చేసి ఇంట్లో వాళ్ళు విషయం చెప్పడంతో సాగర్ కి దిమ్మతిరిగిందట. మొగలి రేకులు సీరియల్ లో రెండు పాత్రలు వేసిన సాగర్ నటనకు నంది అవార్డు కూడా దక్కింది.

జెమిని ఉగాది అవార్డ్స్ లో బెస్ట్ హీరో అవార్డు అందుకున్నాడు. 100సినిమాలు చేసినా సరే మొగలి రేకులు సీరియల్ తో వచ్చిన గుర్తింపు రాదని సాగర్ చెబుతాడు. అందుకే మళ్ళీ టెలికాస్ట్ చేసినా ఆ సీరియల్ చూస్తారని అంటున్నాడు. మనసంతా నువ్వే సినిమాలో చిన్న పాత్ర వేసిన సాగర్ సినిమా ఛాన్స్ లు కూడా దక్కించుకున్నాడు. 2015లో మాన్ ఆఫ్ ది మ్యాచ్ లో చేసి, ఆతర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్ లో చిన్న పాత్ర వేసాడు. అయితే ఈ సినిమాలో ఇష్టం లేకపోయినా సరే ఈ పాత్ర వేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక సాగర్ కి పెళ్లయింది. ఓ బాబు ఉన్నాడు.