అలాంటి రూమర్స్ పై ‘ఫిదా’ బ్యూటీ సీరియస్…. అసలు విషయం చెప్పేసింది
సెలబ్రిటీల మీద రూమర్స్ రావడం సహజం. ఎందుకంటే వాళ్ళ గురించి వచ్చే రూమర్స్ ఆసక్తి కల్గిస్తాయి. అందుకే ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ మీద మరీ ఎక్కువ రూమర్స్ వింటూంటాం. వాటిని కొందరు ఖండిస్తారు. మరొకొందరు పట్టించుకోకుండా వాటిని కూడా ఎంజాయ్ చేస్తారు. కొందరు సీరియస్ గా తీసుకుంటారు. నయనతార, అనుష్క లాంటి వాళ్ల తర్వాత ఇప్పుడు ఫిదా హీరోయిన్ సాయి పల్లవి గురించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. అసలు సంబంధమే లేకుండా సాయి పల్లవి, దర్శకుడు ఏఎల్ విజయ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తమిళ మీడియాలో కథనాలు కూడా వచ్చేసాయి.
ఇంతకీ ఏఎల్ విజయ్ గతంలోనే హీరోయిన్ అమలా పాల్‌ను పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్ల కాపురం తర్వాత ఇద్దరూ విడిపోయారు. చాలా రోజులుగా ఏఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కణం సినిమా చేసిన సాయి పల్లవితో పెళ్లి అనగానే అంతా షాక్ అయ్యారు. ఇక ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. ఉన్నట్లుండి తనపై ఇలాంటి వార్తలు రావడంతో నిజంగానే సాయి పల్లవి కూడా షాక్ అయింది.
దీంతో సాయి పల్లవి ఈ వార్తలపై స్పందిస్తూ,చాలా ఫైర్ అయింది. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అంటూ ఈ ముద్దుగుమ్మ మండిపడింది . దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఉన్నవి లేనివి ఇలా ఎలా రాస్తారంటూ మీడియాకు క్లాస్ కూడా పీకింది. తన పెళ్లి విషయంలో అంత తొందరేం లేదని.. ఒకవేళ చేసుకోవాల్సి వచ్చినా కచ్చితంగా చెప్పే చేసుకుంటానని ఈ భామ చెబుతోంది. అసలు బేస్ లెస్ రూమర్స్ రాయడం మంచి పద్దతి కాదంటూ ఫిదా బ్యూటీ ఓ రేంజ్ లో చెడుగుడు ఆడేసింది.