సిద్దార్ధ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి….టాలీవుడ్ సినిమాలకు దూరం అవ్వటానికి కారణం ఏమిటో తెలుసా?
తెలుగు,తమిళ,మళయాళ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్ధ్ టాలీవుడ్ లో బాయ్స్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో బాగా దగ్గరైన సిద్ధార్ధ్ , ఇక బొమ్మరిల్లు మూవీతో భారీ క్రేజ్ అందుకున్నాడు. హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా,గాయకునిగా సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న సిద్ధార్ధ్ 1979ఏప్రియల్ 17న చెన్నైలో పుట్టాడు . చెన్నై స్కూల్ లో చదువుకుని ఆతర్వాత ఢిల్లీలో సర్ధార్ పటేల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ వరకూ చదువుకున్నారు. ఇంటర్ కూడా అక్కడే చదివిన సిద్ధార్ధ్ బీకాంలో డిగ్రీ అందుకున్నాడు. కాలేజీ డేస్ లో చర్చా సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నికై ఎన్నో పోరాటాలు చేసాడు.
విద్యార్థుల సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు , ప్రభుత్వం ఫీజులు చెల్లించాలంటూ ధర్నాలు కూడా చేసాడు. ముంబయిలోని ఎస్పీ ఏ మేనేజ్ మెంట్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కాలేజీలో ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నో బహుమతులను కూడా అందుకున్నాడట. 1999లో సి ఎన్ బిసి మేనేజర్ అవార్డు అందుకున్నాడు. స్టడీస్ పూర్తవ్వడంతో తండ్రికి మిత్రుడైన దర్శకుడు జయేంద్ర సూచన మేరకు ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. ఆతర్వాత తండ్రి తీసుకున్న థియేటర్ ని సిద్ధార్ధ్ కొన్నాళ్ళు రన్ చేసాడు.
రచనకు కూడా పదును పెట్టి, డైరెక్షన్ మెళుకువలు నేర్చుకున్నారు. జయేంద్ర దగ్గర అసిస్టెంట్ గా చేరి,రచనలు కూడా చేసేవాడు. ఒకరోజు కొత్త సినిమా నటుడికోసం డైరెక్టర్ శంకర్ ఆడిషన్స్ నిర్వహించగా, సిద్ధార్ధ్ హాజరై,సెలక్ట్ అయ్యాడు. ఆవిధంగా బాయ్స్ మూవీతో 2002లో ఎంట్రీ ఇచ్చాడు. మున్నా పాత్రలో చేసిన సిద్ధార్ధ్ కి మంచి గుర్తింపు లభించింది. భారీ విజయం కూడా నమోదుచేసుకుంది. బెస్ట్ యాక్టర్ గా ఐఫా అవార్డు లభించింది.
తమిళంలో మణిరత్నం డైరెక్షన్ లో చేసిన సినిమా కూడా మంచి హిట్ అయింది. 2005లో ప్రభుదేవా డైరెక్షన్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో నటించగా తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
తర్వాత చుక్కల్లో చంద్రుడు మూవీ డిజాస్టర్ అయింది. అయితే హిందీలో చేసిన ఓ సినిమాలో ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు మూవీ సిద్ధార్ధ్ కి ఊహించని క్రేజ్ తేవడమేకాదు ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కలెక్షన్స్ వర్షం కురిపించింది.
కొంచెం ఇష్టం,కొంచెం కష్టం సినిమాకు కూడా మార్కులు బాగానే పడ్డాయి. ఆతర్వాత వచ్చిన ఓయ్ సినిమా భారీ విజయం అందుకుంది. ఆట మూవీ ప్లాప్ అయింది. అలాగే బాలీవుడ్ లో చేసిన మూవీ కూడా డిజాస్టర్ అయింది. అయితే బావ,అనగనగా ఓ ధీరుడు వంటి మూవీస్ దెబ్బతిన్నాయి. అయితే ఓ మై ఫ్రెండ్ మూవీ తో మళ్ళీ విజయం అందుకున్నాడు. ఆతర్వాత తమిళంలో సినిమాలు చేసి విజయం అందుకున్న సిద్ధార్ధ్ మిడ్ నైట్ అనే ఆంగ్ల సినిమా చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందాడు.
ఎన్ హెచ్4,జబర్దస్త్, సమ్ థింగ్ సమ్ థింగ్ మూవీస్ చేసినా హిట్ కాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమై తమిళంలో స్థిరపడ్డాడు. అయితే గృహం సినిమాతో 2017లో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. తానే కథ,నిర్మాణ బాధ్యతలు చేపట్టినా ఈ సినిమా ఆకట్టుకోలేదు. సింగర్ కూడా అయిన సిద్ధార్ధ్ బొమ్మరిల్లు,అట,ఓయ్ బావ వంటి మూవీస్ లో ఒక్కో సాంగ్ పాడాడు. ఇక కాలేజీ రోజుల్లో మేఘన అనే అమ్మాయితో పరిచయం కారణంగా సిద్ధార్ధ్ ఆమెతో ప్రేమ లో పడి, 2003నవంబర్ 3న పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత విబేధాలు రావడంతో వేరేగా ఉన్నారు. అయితే 2007జనవరిలో విడాకులు తీసుకున్నారు.