శృతి హాసన్ జీవితంలో జరిగిన ఎవరికి తెలియని కొన్ని నమ్మలేని నిజాలు
తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాల్లో తనదైన ముద్రవేసిన శృతి హాసన్ నటి గానే కాకుండా మోడల్, సింగర్, డాన్సర్, డైరక్టర్ అండ్ కంపోజర్ గా కూడా గుర్తింపు పొందింది . సౌత్ ఇండియన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురైనందున సర్వ కళా పరిజ్ఞానం తండ్రి దగ్గర నుండే అందిపుచ్చుకున్నట్లు ఉంది. కమల్ హాసన్ కు, నటి సారిక దంపతుల పెద్ద కుమార్తె అయిన శృతి , జనవరి 28 చెన్నై లో జన్మించింది. చిన్నకూతురు అక్షర హాసన్ కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. 2000 సంవత్సరంలో కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘హే రామ్’ సినిమాలో బాలనటిగా అలరించిన శృతి, ఆ తరువాత సంగీతంపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది.
2011 లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శృతి అటు గ్లామర్ పరంగా, ఇటు యాక్టింగ్ పరంగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. కెరీర్ మొదట్లో కొన్ని పరాజయాలు చవిచూసిన్నప్పటికీ కేవలం తన టాలెంట్ కారణంగా అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయిక జాబితాలో చేరింది.
అయితే ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న శృతి హాసన్.. సినిమాల నుండి కొంత విరామం తీసుకుని హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే శృతి మళ్ళీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే శృతి హాసన్ గురించి కొన్ని ఆసక్తికర ఘటనలున్నాయి.
వాటిని పరిశీలిస్తే, ఈమె 8 భాషలలో మాట్లాడగలదట. శృతి 14 సంవత్సరాల నుండే సినిమా స్క్రిప్ట్స్ రాయడం మొదలుపెట్టింది. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరక్ట్ చేసింది. తొలి బాలీవుడ్ సినిమా ‘లక్’ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో సిద్దార్ధ్ తో కలసి ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈమె మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ తో ఆమె చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ‘ఓ మై ఫ్రెండ్’, ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాలు నిరాశపరిచినప్పటికీ ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకుంది.’ప్రేమమ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలలో తన అభినయానికి విమర్శల ప్రశంసలు అందుకుంది. ‘ఆగడు’ సినిమాలో మహేష్ బాబుతో కలసి ఓ స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.
శృతి హాసన్ 6 ఏళ్ళ వయసప్పుడే ఇళయరాజా సంగీత సారథ్యంలో ‘దేవర్ మగన్’ సినిమాలో ఒక పాట పాడింది. అదే తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’.’ఇళయరాజా’, ‘హారిస్ జైరాజ్’, ఏ .ఆర్. రెహమాన్, ఎస్. ఎస్. థమన్, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో తెలుగు, తమిళ భాషలలో అనేక పాటలు పాడింది. తమిళంలో సూర్య సరసన ‘7 లామ్ అరివు’, ‘ఎస్ 3’ చిత్రాలలో మెప్పించగా ధనుష్ తో ‘3’ సినిమాలలో నటించింది. ‘రేసుగుర్రం’ చిత్రంలో తన నటనకు ఆమెను ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులు వరించాయి.