తాగుబోతు రమేష్ బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదో తెలుసా…. సినిమాల్లోకి రాకముందు ఏ పని చేసేవాడో తెలుసా?
పలు సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్ లో రాణించి ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచిన రమేష్ జగడం మూవీతో ఎంట్రీ ఇచ్చి తాగుబోతు క్యారెక్టర్ తో ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే రెండేళ్ల వరకూ ఎలాంటి ఛాన్స్ లు లేకుండా ఉన్నాడు. ఆతర్వాత మహాత్మా , అలా మొదలైంది మూవీస్ తో తాగుబోతు రమేష్ గా పాపులర్ అయ్యాడు. ఇతడి అసలుపేరు రమేశ్ రామిళ్ళ. 14ఏళ్ళ వయస్సులోనే అమ్మను కోల్పోయిన రమేష్ మొదట్లో ఆటో నడిపాడు. వాచ్ మెన్ గా పనిచేసి,సినిమాల్లోకి ప్రవేశించాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు. తల్లి గృహిణి. రమేష్ కి నలుగురు అన్నదమ్ములు,ఒక సోదరి ఉన్నారు.
బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి, ముఖ్యంగా తండ్రి తాగి వచ్చి చేసే పనులను గమనించేవాడు. అందుకే తాగుబోతుల మాదిరిగా రమేష్ నటిస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసిన రమేష్ సినిమాల్లో మాత్రం ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు. గతంలో మిమిక్రీ కూడా చేసేవాడు. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకూ చదువుకున్నాడు. తల్లి మరణించడంతో పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇక 20ఏళ్ళ వయస్సు వచ్చేసరికి తండ్రి మరణించాడు.
ఇద్దరు అన్నయ్యలు,వదినలు ఇతడి బాగోగులు చూసారు. మిత్రుల దగ్గర మిమిక్రీ చేస్తూ, తాగుబోతు గా నటిస్తూ నవ్విచేవాడట. ఖాళీగా తిరుగుతున్న రమేష్ ని వరంగల్ దగ్గర తన మేనమామ దగ్గరకు సూపర్ వైజర్ గా చేర్చారు. అదేసమయంలో లారీలు నడపడం,మిమిక్రీతో అలరించడం చేసేవాడు. అందరూ సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించారట. అదేసమయంలో అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటన నేర్పస్తారన్న ప్రకటన చూసి, తన అన్నయ్యలు ఇచ్చిన కొంత డబ్బు తీసుకుని హైదరాబాద్ వచ్చాడు.
రెండు నెలలు ట్రైనింగ్ అయ్యాక గడవడం కష్టం కావడం,అన్నయ్యలకు ఇక ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్ గా పార్ట్ టైం పనిచేస్తూ ఆ డబ్బులతో గడిపేవాడు. మూడునెలలు గడిచాక ఇనిస్టిట్యూట్ కి డైరెక్టర్ సుకుమార్ రావడం,అయన తీస్తున్న జగడం మూవీలో రమేష్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగాయి. ఆవిధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ కి ఆతర్వాత ఛాన్స్ లు రాకపోవడంతో ఉదయం ఛాన్స్ లకోసం ప్రయత్నాలు చేస్తూ రాత్రిళ్ళు వాచ్ మెన్ గా చేసేవాడు. మళ్ళీ డ్రైవర్ గా చేసాడు.
ఓనర్స్ కూడా ఇతడికి ఎక్కువ జీతం ఇచ్చి ప్రోత్సహించారట. ఇక కృష్ణవంశీ తీసిన మహాత్మా మూవీలో ఛాన్స్ వచ్చింది. భీమిలి (సినిమా),అలా మొదలైంది (సినిమా) కె ఎస్ డి అప్పలరాజు,కోడిపుంజు,అహ! నా పెళ్ళంట!,100% లవ్,ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాల్లో చేసిన రమేష్ కి అలా మొదలైంది మూవీ మరింత క్రేజ్ తెచ్చింది. తాగుబోతు రమేష్ గా పాపులర్ కావడంతో ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి.
మడత కాజా, ఎస్ ఎం ఎస్, ఐష్,మేం వయస్సుకి వచ్చాం,ఈగ, గుండె జారి గల్లంతయింది లాంటి సినిమాల్లో చేసిన రమేష్ ఆతర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డు కొట్టాడు. యమహా యమా,కుమారి21ఎఫ్ వంటి చిత్రాలతో కూడా పేరు తెచ్చుకున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం,వంటి మూవీస్ తో అదరగొడుతూ మంచి స్థాయికి చేరుకున్న రమేష్ ఎందరికో ఆదర్శం అని చెప్పాలి.