Movies

అంత సీన్ లేదు అయినా రకుల్ కి అంత సొమ్ము ఎందుకు?

సినిమా రంగంలో స్టార్ ఇమేజ్ కొనసాగుతుంటే ఎంత సొమ్మైనా పోసేస్తారు. అదే ఒక్క ప్లాప్ వస్తే చాలు మార్కెట్ పడిపోతుంది. అలాగే టాలీవుడ్‌లోనే మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఢీలా పడిపోయింది. అయితే ఈ అమ్మడుకి రెండు సంవత్సరాలుగా ఆఫర్లు లేకపోయినా కూడా తాను ఇంకా స్టార్‌ హీరోయిన్‌ అంటూ నిరూపించు కుంటుంది. తన పారితోషికం ద్వారా ఆమె స్టార్‌ హీరోయిన్‌గా చెప్పకనే చెబుతోంది. టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కు లైఫ్‌ స్పాన్‌ తక్కువ అని రకుల్‌ను చూస్తుంటే, అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం స్టార్‌ హీరోయిన్స్‌గా ఉంటారు.

అందుకే రకుల్ ని కూడా అలా ఊహించుకున్నారు. కానీ ఆమె రేంజ్ తగ్గలేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా నాగార్జునకు జోడీగా ‘మన్మధుడు 2’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. లో బడ్జెట్‌లో నాగార్జున నిర్మించబోతున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇచ్చే పారితోషికం చూస్తే దిమ్మతిరుగుద్ది. సక్సెస్‌లు లేని రకుల్‌కు అంత పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు కోటి రూపాయలు ఇచ్చినా,ఎక్కువేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది 25 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాకు హీరోయిన్‌ పారితోషికం రెండు కోట్లు ఎలా ఇచ్చేస్తున్నారంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే ఇంతసొమ్ము ఇస్తున్న నేపథ్యంలో కావాలనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సన్నిహితుల ద్వారా తన పారితోషికంను లీక్‌ చేయించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆమె పారితోషికం తీసుకుంటుంది, ఇంకా ఆమె ఫుల్‌ డిమాండ్‌ను క్రేజ్‌ను కలిగి ఉందని అనుకునేలా ప్లాన్‌ చేయడం వల్లనే ఇలా లీక్ చేయించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదోరకం పబ్లిసిటీ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి రకుల్ ఈ మూవీ ద్వారా తన డిమాండ్ ని పెంచుకుంటుందో,తగ్గించుకుంటుందో చూడాలి.