Movies

వెంకీ కూతురు పెళ్ళిలో యువకుడి సందడి – అందరి దృష్టి అతడి వైపే…. ఎవరో తెలుసా?

రాజస్థాన్ రాజధాని జయపూర్ లో ఓ హోటల్ లో విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రీత పెళ్లి హైదరాబాద్ రేస్ క్లబ్ కి మంచి గుర్తింపు తెచ్చిన ఆర్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి తో2019మార్చి 24 ఆదివారం ఘనంగా జరిగింది. రామ్ చరణ్ ,ఉపాసన దంపతులు,నాగచైతన్య,సమంత దంపతులు,సల్మాన్ ఖాన్ ఇంకా ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. అంతా బానే ఉంది అయితే ఈ పెళ్ళిలో ఓ యువకుడి సందడి చూసి అందరి చూపు అతనిపై పడింది .

ఇంతకీ ఆ యువకుడు ఎవరా అని ఆరా తీశారు. ఎందుకంటే నాగ చైతన్య,సమంతల పెళ్ళిలో కూడా తోడ పెళ్ళికొడుకుగా కనిపించాడు. అయితే అప్పుడు కొంచెం చిన్న కుర్రాడుగా ఉన్నా, ఇప్పుడు కాస్త పెద్దయ్యాడు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు పెద్దకొడుకు సురేష్ బాబు సినిమాల్లో నిర్మాతగా బిజీ కాగా, రెండో కొడుకు వెంకటేష్ హీరోగా రాణిస్తున్నాడు.

నిజానికి వెంకీ సినిమాల్లోకి రావాల్సిన వాడు కాదు. ఇతర హీరోల డేట్స్ కోసం విసిగిపోయిన రామానాయుడు చివరకు వెంకీని హీరోగా పెట్టి సినిమా తీసాడు. అనుకోకుండా తండ్రి వత్తిడితో హీరో అయ్యాడు. ఇటీవల ఎఫ్ 2మూవీతో సినిమాహాల్స్ లో నవ్వులు పూయిస్తున్నాడు. మొదట్లో తండ్రి సపోర్ట్ ఉన్నప్పటికీ ఆతర్వాత సొంతంగా ఎదిగాడు.

సురేష్ బాబు కొడుకు రానా క్రేజీ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నాడు. రామానాయుడు ఫామిలీ నుంచి వెంకటేష్,రానా హీరోలుగా నిలదొక్కుకుంటే,గోపాల గోపాల మూవీతో వెంకీ కొడుకు అర్జున్ బాలనటుడిగా మెప్పించాడు. వెంకటేష్ కి ముగ్గురు కూతుళ్లు. ఒకడే కొడుకు. సురేష్ కొడుకు రానా హీరోగా అదరగొడుతుంటే ఇక వెంకీ సినీ వయస్సు కూడా అయిపోతోంది. అందుకే కొడుకు మీద ఫాన్స్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం స్టడీస్ మీద దృష్టిపెట్టిన అర్జున్ కూడా సినీ రంగప్రవేశం చేసి హీరోగా రాణిస్తాడో వేరే రంగంలోకి వెళతాడో నని అందరూ చర్చించుకుంటున్నారు.