సూర్యకాంతం ట్రైలర్ చూసాక అంచనాలు ఎలా ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు
మెగా డాటర్ నిహారిక, రాహుల్ విజయ్ జంటగా నటించిన సూర్యకాంతం మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. నిహారిక టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ ముక్కోణపు లవ్ స్టోరీ గా నడుస్తుంది. ప్రణీత్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ కి సంబంధించిన కథను ట్రైలర్ లోనే చూపించేసారు. ముక్కుసూటి తనం, నిలువెల్లా చలాకీతనం నింపుకున్న సూర్యకాంతం పాత్రలో నిహారిక ఒదిగిందని చెప్పాలి. అభికి ఓ యాక్సిడెంట్ లాంటి ఘటనలో సూర్యకాంతం పరిచయం అవుతుంది. అయితే సూర్యకాంతం తీరు అభికి అంతుబట్టదు.
సూర్యకాంతంలో ఇష్టాన్ని పెంచుకున్న కొంతకాలానికి అభికి పూజతో ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఇక పూజ, సూర్యకాంతం లు అభిని తమ వైపు తిప్పుకోడానికి ఒకరికి తెలియకుండా మరొకరు పోటీ పడతారు. ఈ ట్రింగిల్ లవ్ స్టోరీలో సూర్యకాంతం ఎలా నెగ్గిందనేది సినిమా అసలు కథ. వినోదంతో పాటు ఉద్దేశ్యం కూడా ప్రణీత్ ఎంచుకున్న విధానం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉందని చెప్పవచ్చు. ఏదయినా అనుకుంటే చాలు చేసి తీరే తత్వంతో సూర్యకాంతం పాత్రను తీర్చిదిద్దారు.
రాహుల్ విజయ్ స్మార్ట్ గా , కొత్త అమ్మాయి బెర్లిన్ క్యూట్ గా వున్నారు. హీరో తండ్రిగా శివాజీ రాజా, అభి ఫ్రెండ్ గా సత్య కామెడీ పాత్రలు పోషించారు. సృజన యర్రబోలు,సందీప్ ఎర్రంరెడ్డి నిర్మించిన సూర్యకాంతం మూవీ సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. మెగా కాంపౌండ్ లో ఈ సినిమా హిట్ టాక్ పడుతుందని అంటున్నారు.