నిహారిక భవిష్యత్ సూర్యకాంతం మీదే ఆధారపడింది….మరి ఏమి జరుగుతుందో పాపం?
సినిమాల్లోకి హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడానికి అభ్యంతరాలు ఉండవు కానీ,ఆడపిల్లలు ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఎన్నో అభ్యంతరాలు వచ్చేస్తాయి. ఇక మెగా డాటర్ నిహారిక కూడా సినిమాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తే ముందు ఒప్పుకోలేదట. అయితే ఫ్యామిలీలో అందరి ఒప్పించి ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చేముందే ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయి,కానీ రెండు మూడేళ్ళ తర్వాత మాత్రం నీ పెళ్లి చేస్తా’అని నాగబాబు చెప్పాడట. ఇంత కష్టపడి సినిమాల్లోకి వచ్చి, ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే రావలసిన గుర్తింపు రాలేదు. రెండు డిజాస్టర్ అయ్యాయి.
దీంతో ముచ్చటగా మూడు సినిమాగా రాహుల్ విజయ్ తో కల్సి నటించిన సూర్యకాంతం మూవీ మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ప్రణీత్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా చేస్తున్నాడు. కొత్త అమ్మాయి బెర్లిన్ కూడా హీరోయిన్ గా వేసింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే నిహారిక పోషించిన టైటిల్ రోల్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా నడిచే ఈ మూవీ కి సంబంధించిన కథను పరిశీలిస్తే నిహారిక చుట్టూనే తిరుగుతుంది.
సినిమా ఎంత కొత్తగా ఉన్నా సరే,జనాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల వైపు నడిపించడం కష్టంగానే మారిపోయింది. ఇలాంటప్పుడు సూర్యకాంతం సినిమా కు ఎలాంటి టాక్ వస్తుందో చెప్పడం కష్టం. సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే సరేసరి,లేకుంటే నిహారిక కెరీర్ కి ఇక తెరపడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కాశం. దాన్ని బట్టే నిహారిక భవిత ఆధారపడి ఉంటుంది.