అలనాటి నటి సూర్యకాంతం చివరి రోజులు ఎలా గడిచాయో తెలిస్తే అయ్యో పాపం అంటారు
సినిమా ఇండస్ట్రీ వడ్డించిన విస్తరి కానేకాదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆతర్వాత అష్టకష్ఠాలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అప్పట్లో సూర్యకాంతం అంటే గయ్యాళి అత్తగా అందరి ముందు రూపం ప్రత్యక్షం అయ్యేది. ఆనాటి సూర్యకాంతం కి గల క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నిహారిక తో తీసిన సూర్యకాంతం సినిమాకు అందుకే ఆపేరు పెట్టారు. దీన్ని బట్టి సూర్యకాంతం బ్రాండ్ ఇమేజ్ ఏపాటిదో చెప్పక్కర్లేదు. ఈమె వేసిన గడసరి పాత్రల వలన ఎవరూ ఆపేరు పెట్టుకోడానికి భయపడతారు. సొంతంగా వండడమే కాదు,తన ఇంటికి వచ్చినవాళ్ళకి కొసరి కొసరి తినిపించడంలో సూర్యకాంతం శైలి మరెవరికీ రాదు.
భోజం కోసమే ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవారట చాలామంది. అంతగా ఆమెకు బ్రాండ్ ఉండేది. ఆమె పేరుతొ ఓ హోటల్ ఇప్పుడు పెట్టినా నిత్యం రద్దీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆమెకు పిల్లలు లేకపోవడంతో సమీప బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచుకున్నారు. చిన్నప్పుడు చదువుకోలేక పోయానన్న బాధ ఉండేది. అందుకే సూళ్లూరుపేటలో గల స్థలాన్ని స్కూల్ కోసం ఇచ్చి తనకున్న విద్యాపిపాసను చాటుకున్నారు. ఇక గౌరవ డిగ్రీ అందుకున్న అరుదైన నటి గానే కాకుండా ఫ్రెంచ్ వంటి భాషలు నేర్చుకుని తనకున్న జిజ్ఞాసను చాటుకున్నారు.
ఆరోజుల్లో ఎన్టీఆర్,అక్కినేని వంటి ఇద్దరు దిగ్గజాలు కల్సి నటించిన సినిమాలో టైటిల్ రోల్ పోషించిన ఘనత సూర్యకాంతం కి దక్కుతుంది. పైగా ఆ హీరోలిద్దరూ అప్పట్లో సూర్యకాంతం క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, ఆమె టైటిల్ రోల్ గల సినిమాలో యాక్ట్ చేసారు. ఆ సినిమా ఇప్పటికీ టివిలో వస్తోందంటే టీవీలకు అతుక్కుపోతారు జనం. అంతలా పాపులర్ ఐన ఆ సినిమా గుండమ్మ కథ. ఇక సూర్యకాంతం కాకినాడ దగ్గరలో సంప్రదాయ కరణాల కుటుంబంలో 14వ అమ్మాయిగా పుట్టారు. సినిమాల్లో హీరోయిన్ కావాలనుకున్నారు. అదికూడా హిందీలో అట. ఐతే మన తెలుగులో నటించాలని భావించిన నేపథ్యంలో ఛాన్స్ వచ్చినా తనంత తానుగా వదిలేసుకుంది.
దాంతో చిన్నా చితకా పాత్రలలో నటించింది ఇక సూర్యకాంతం కోసం పాత్రలు సృష్టించే స్థాయికి ఎదిగింది. చిన్నప్పటినుంచి నాటకాల పిచ్చితో ఎన్నో నాటకాల్లో నటించిన సూర్యకాంతం సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఆమె కోసం సృష్టించిన పాత్ర ఆమె తప్ప ఇంకెవరూ పోషించలేరు అన్నట్లుగా రాణించింది. ఇక ఈంకు షుగర్ వ్యాధి ఉండడంతో అది బయటకు చెప్పకుండా దాచారు. దాని ద్వారా మరికొన్ని రోగాలు ప్రబలినా ఏనాడూ బయటకు పొక్కనీయలేదు.
సినిమాల్లో ఛాన్స్ లు ఎక్కడ తగ్గిపోతాయోనన్న భయమే ఆమెను రోగాలు దాచేసేలా చేసింది. ఇక ఇంటికి ఎవరైనా వస్తే, సపర్యలు చేయించుకోవడం కాకుండా, తాను చేసిన వంట తినేసి వెళ్లాలని మొహమాట పెట్టేవారట. ఇక రోగాల కారణంగా ఆమె బాగా నీరసించిపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్పీ పరశురామ్ మూవీలో నటించిన ఆమెకు అదే చివరి సినిమా. ఇక అదే ఏడాది ఆమె మరణించారు. ఆమె మరణిస్తే పట్టుమని పది మంది కూడా రాలేని దీనావస్థను ఎదుర్కొంది.