‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో ప్రియురాలు వినీత ఎలా ఉందో తెలుసా?
సినిమా వాళ్ళు సెలబ్రిటీలుగా ఉండడం వలన వాళ్ళ గురించి వచ్చే వార్తలు, గాసిప్స్ ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారో అని పూసగుచ్చినట్లు బయటకు తెలిసిపోతాయి. ఇక సోషల్ మీడియాలో ఏదీ దాగడం లేదు. ఇది నిజమా కాదా అనే లోపు వైరల్ అయిపోతోంది. ఇక ఒకప్పుడు అందాల నటుడు శోభన్ బాబుతో తీసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ అప్పట్లో జనానికి బాగా కనెక్ట్ అయింది. సౌందర్య ఇల్లాలుగా నటించగా, ప్రియురాలిగా వినీత నటించింది. గ్లామర్ ఒలకబోస్తూ ఈమె చేసిన నటన జనాన్ని బాగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు.
వినీత మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, ఆ తర్వాత వరుస ఛాన్స్ లు వచ్చాయి. అయితే సినిమాల్లో టార్చర్ భరించలేక సినీ రంగాన్ని వదిలి పోయింది. ఆతర్వాత దాదాపు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామర్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. 1978లో కేరళలో పుట్టిన వినీత తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో తమిళంలో బిజీ హీరోయిన్ గా మారింది.
ఈ నేపథ్యంలో తెలుగులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలో నటించింది.1996 లో వచ్చిన ఈ మూవీ తో వినీతకు మంచి క్రేజ్ వచ్చినా,సౌందర్య ముందు నిలబడలేకపోయింది. ఎందుకంటే, సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ఆదరిసున్నందున వినీత ను ఆదరించలేకపోయారు. అయితే తమిళ, మళయాళం లలో మాత్రం వినీత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దాదాపు 70సినిమాలకు పైగా అన్ని భాషల్లో నటించినప్పటికీ సడన్ గా సినిమాల నుంచి దూరం అయింది. వినీత ను ఆమె తల్లిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టడం దీనికి కారణం. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న వినీత ఇలా చేయడం ఏమిటి అంటూ అందరూ చెవులు కొరికేసుకున్నారు. ఈ కేసు నుంచి బయట పడ్డానికి ఆమె కు చాలా సమయం పట్టింది.
తన కెరీర్ ను చూసి తట్టుకోలేక సినిమా రంగం వాళ్ళే తనపై ఇలా బురద చల్లారని వినీత చెప్పుకొచ్చింది. దీంతో ఇండస్ట్రీకి దూరంగా జరిగిన వినితీ పదేళ్ల విరామం తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తమిళ రంగంలో ఎంట్రీ ఇచ్చిన బిజీగా ఉంది. అయితే అప్పట్లో ఎంతో గ్లామర్ గా కనిపించిన వినీత ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.