కలర్స్ స్వాతి గురించి ఇంటెస్టింగ్ విషయాలు…..పెళ్లి తరవాత ఏమి చేస్తుందో తెలుసా?
మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుని అదే ఇంటిపేరుగా కలర్స్ స్వాతిగా ప్రసిద్ధిపొందింది. ఈమె పూర్తి పేరు శ్వేతా రెడ్డి. నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి గా గుర్తింపు పొందిన స్వాతి 1987 ఏప్రిల్ 19 శివ రామకృష్ణ , ఇందిరా దేవి దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక అన్నయ్య సిద్ధార్థ్ ఉన్నాడు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది.
పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు. వీరి మకాం రష్యా నుంచి మొదటగా ముంబై కి తర్వాత విశాఖపట్నంకి మారింది. స్వాతి చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉండగా ఈమెకు హైదరాబాదుకు వెళ్ళింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఎం. బి. బి. ఎస్ సీటు తెచ్చుకుంది. కానీ డాక్టర్ కావాలనే కోరిక లేకపోవడంతో బి. ఎస్. సి బయోటెక్నాలజీ చదివింది. తర్వాత ఫోరెన్సిక్ లో పి. జి. చేసింది.
ఓపక్క కాలేజీకి వెళ్తూనే మరోవైపు సాయంత్రం వేళ 16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టివి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. పేరెంట్స్ కి చెప్పి ఒప్పించడంతో 2005లో డిగ్రీ ఫస్టియర్ లో వుండగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో చేసిన లక్ష్మి పాత్రకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత డిగ్రీ సెకండ్ యియర్ చదువుతుండగా వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలుగా నటించింది. తర్వాత డిగ్రీ మూడో ఏడాది చదువుతుండగా హీరో నాని కి జోడిగా అష్టాచెమ్మా మూవీలో తొలిసారి హీరోయిన్ గా చేసింది. ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఇక అదేసమయంలో మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం) లో నటించింది.
తమిళంలో ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. కలవరమాయే మదిలో సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. సుమంత్ కి జోడీగా గోల్కొండ హైస్కూల్ మూవీలో చేసి, హిట్ కొట్టింది. సునీల్ సరసన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు లో చేసింది. ,మిరపకాయ్, కందిరీగ వంటి మూవీస్ లో సహాయ పాత్రలలో చేసిన స్వాతి 2008 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన జల్సా సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది.,స్వామిరారా చిత్రంలో నిఖిల్ కి జతగా నటించగా, స్వాతికి మంచి గుర్తింపు లభించింది. మలయాళం,తమిళంలో చాలా ఛాన్స్ లు వచ్చాయి.
ఇక నిఖిల్ సరసన కార్తికేయ మూవీలో నటించి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆతర్వాత తెలుగు లో ఛాన్స్ లు రాకపోవడంతో తమిళ,మళయాళ సినిమాల్లో చేస్తూ వచ్చింది. తెలుగులో త్రిపుర, ,లండన్ బాబులు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కలర్స్ స్వాతి కి గతంలో నిఖిల్ తో ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న టాక్ రావడంతో తాను మలేషియా ఎయిర్ లైన్స్ పైలెట్ గా ఉద్యోగం చేస్తున్న వికాస్ అనే వ్యక్తిని లవ్ చేస్తున్నట్లు ప్రకటించింది . ఇంట్లో ఒప్పించడంతో 2018ఆగస్టు 30న స్వాతి,వికాస్ పెళ్లిచేసుకున్నారు.