Movies

రాశి ఖన్నా గురించి నమ్మలేని నిజాలు… తెలుగులో అవకాశాలు రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

2013లో విడుదలైన హిందీ చిత్రం “మద్రాస్ కెఫె”లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన రాశి ఖన్నా ముద్దుగా ,బొద్దుగా కళకళ లాడుతుంది. ఈమె ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుని హీరోయిన్ అయింది. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. వరుస ఛాన్స్ లతో తెలుగులో దూసుకొచ్చింది. 1990నవంబర్ 30న రాజ్ సరితా, ఖన్నా దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్నారు. తండ్రి రాజ్ ఖన్నా ఢిల్లీ మెట్రో సేల్స్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవారు. తల్లి విద్యావంతురాలైనా సరే గృహిణి. దీంతో రాశికి ఢిల్లీలోనే స్టడీస్ సాగాయి. ఓ యూనివర్సిటీ నుంచి బిఎ లో ఇంగ్లీషు పట్టా అందుకుంది. చిన్నప్పటినుంచి స్టడీలో నెంబర్ వన్ గా నిలిచింది.

టాలీవుడ్ లో నటించే ఉత్తరాది భామల్లో తెలుగులో మాట్లాడేవాళ్లలో రాశిఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమా సమయంలో కష్టపడి తెలుగు నేర్చుకుంది. సాంగ్స్ పాడడం,స్విమ్మింగ్ చేయడం ఇష్టం. అయితే కాలేజ్ డేస్ లో ఆమె ఫ్రెండ్స్ మోడలింగ్ చేయడంతో ఆమెను కూడా చేయమని అడిగారట. బొద్దుగా ఉండడం వలన చేయనని చెప్పడంతో కొన్నాళ్ల తర్వాత మళ్ళీ మోడలింగ్ ఛాన్స్ రావడంతో నటించింది. అలా ఆమె ఫోటోని హిందీ డైరెక్టర్ సుజిత్ సర్కార్ చూసి , సినిమాలో హీరోయిన్ గా వేయించాలని కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ ని కల్సి వివరాలు సేకరించి,రాశిని సంప్రదించగా, ఐ ఏ ఎస్ కావాలని ఉందని, అందుకే సినిమాలు చేయనని చెప్పేసిందట.

అయితే కొన్నాళ్ల తరువాత ఫ్యామిలీ ఎంకరేజ్ మెంట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుని డైరెక్టర్ సుజిత్ సర్కార్ ని సంప్రదించడంతో ఆయన డైరెక్షన్ లో “మద్రాస్ కెఫె” మూవీలో హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయింది. ఇక తెలుగులో మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో రాశిఖన్నా నటించింది. ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.

దీంతో వరుసగా సినీ అవకాశాలు వచ్చిపడ్డాయి. 2014లో కుమార్ నాగేంద్ర డైరెక్షన్ లో జోరు మూవీలో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ సినిమా హిట్ కాలేదు. 2015లో జిల్ సినిమాలో హీరో గోపిచంద్ సరసన నటించింది. ఈ సినిమా లో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. సినిమా హిట్ అవ్వడంతో అదే ఏడాది రవితేజ సరసన బెంగాల్ టైగర్, రామ్ హీరోగా శివం మూవీస్ లో చేసి మంచి పేరు కొట్టేసింది. 2016లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సుప్రీం మూవీలో పోలీస్ పాత్రలో సాయిధరమ్ తేజ్ సరసన నటించింది.

ఆ తర్వాత రామ్ తో చేసిన హైపర్ ఆకట్టుకోలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జై లవ కుశ మూవీలో నటించి హిట్ అందుకుంది. ,2017 లో రవితేజాతో రాజా ది గ్రేట్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో చేసి ఆడియన్స్ ని మైమరపించింది. అదే ఏడాది మలయాళంలో ,విలన్ సినిమాలో చేసింది. ఆతర్వాత తెలుగులో ఆక్సిజన్ మూవీ చేసినా బోల్తా కొట్టింది.

మళ్ళీ రవితేజతో టచ్ చేసి చూడు మూవీలో చేసినా గుర్తింపు రాలేదు. 2018లో వరుణ్ తేజ్ తో తొలిప్రేమ మూవీలో జతకట్టి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే అదే ఏడాది నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం లో నటించిన రాశిఖన్నా తెలుగు సంప్రదాయాలను ఉట్టిపడేలా నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం వెంకీ మామా మూవీ చేస్తోంది.