Movies

సిల్క్ స్మితను మోసం చేశారా .. అవునంటున్న ఆమె బ్రదర్… ఎవరో తెలుసా?

సిల్క్ స్మిత అంటే అప్పట్లో ఖచ్చితంగా ఆమె పాట ఒకటి సినిమాల్లో ఉండి తీరాల్సిందే. ఆమె మత్తైన కళ్ళతో ఆడియన్స్ ని మైమరపించిన సిల్క్ స్మిత పాటవుంటే చాలు ఆ సినిమా లాభాల బాట పట్టేస్తుందన్న నమ్మకం ప్రొడ్యూసర్స్,డైరెక్టర్స్ కి ఉండేది. జనం కూడా ఆమె పాటకోసం క్యూ కట్టేవారు. అందుకే అప్పట్లోనే ఒక పాటకు 50వేలు అందుకునేదంటే ఆమె రేంజ్ ఏమిటో చెప్పక్కర్లేదు. అప్పట్లో లక్షలకు లక్షలు ఆమె సంపాదించినప్పటికీ ఆమె తల్లి దీనావస్థలో ఉంది. తమ్ముడు కూడా పేదరికం లో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఆమె సంపాదించిన ఆస్థి ఏమైపోయిందోనని అందరూ అనుకుంటారు.

ఎవరు ఆ డబ్బు కొట్టేశారని అంటే ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆపేరే డాక్టర్ రాధాకృష్ణ. నిజానికి సిల్క్ స్మిత కడుపేదరికంలో పుట్టింది. ఆమెను పెంచడం తల్లికి ఇబ్బందిగా మారడంతో మరొకరి పెంపకంలో పెరిగింది. చిన్నప్పటినుంచి సినిమాల మీద ఆసక్తితో పెంపుడు తల్లితో సహా చెన్నై కి చేరిన సిల్క్ అక్కడ బతుకుతెరువుకోసం పాచిపనులు సైతం చేసింది. చిన్న చితకా అవకాశాలతో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసి,మెల్లిగా స్టార్ గా ఎదిగింది. తమిళ మూవీలో పాత్ర ద్వారా పాపులర్ అయ్యి, సిల్క్ స్మితగా మారింది.

ఎన్టీఆర్ ,ఎంజీఆర్, రజనీ,కమల్,చిరంజీవి,కృష్ణ,ఇలా అగ్ర హీరోలందరి తో పోటీపడి డాన్స్ లతో క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఐటెం సాంగ్స్ తో యువ హృదయాల్లో డ్రీమ్ గాళ్ అయింది. భారతీయ మార్లిన్ మన్రో గా ఫేమస్ అయింది. ఇక రాధాకృష్ణ ఎంబిబిఎస్ ,ఆర్ ఎం పి అనేది తెలియని డాక్టర్ గా చెలామణిలోకి వచ్చేసాడు. అతడికి అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి. సిల్క్ స్మిత బాగోగులు చూసుకుంటానన్న వంకతో ఆమె పంచన చేరిన రాధాకృష్ణ కు భార్య వున్నా సరే సిల్క్ చేరదీసింది.

చదువుకున్నవాడు కావడం, తెలుగు,తమిళ తదితర భాషలు తెల్సి సినిమా వాళ్లతో బాగా డీల్ చేస్తాడన్న ఉద్దేశ్యంతో అతడిని పూర్తిగా నమ్మేసి దగ్గరకు చేర్చుకుంది. ఆ నమ్మకమే ఆమెను మోసం చేసిందని, రాధాకృష్ణ చేతిలో వంచనకు గురైందని సిల్క్స్ స్మిత తమ్ముడు వరప్రసాద్ చెబుతాడు. కోట్ల రూపాయలు సంపాదించిన సిల్క్ కి ఏమైందో ఏమో గానీ సడన్ గా మరణించడంతో రాధాకృష్ణ తమకు కొద్దిగా బంగారం,ఓ లక్ష రూపాయల నగదు ఇచ్చి మమ్మల్ని తరిమేసాడని వరప్రసాద్ చెప్పాడు.

తాము వచ్చేసరికే అతడు వెనకేసుకున్నాడని, ఫలితంగా మొదట్లో ఎలాంటి పేదరికం అనుభవించామో ఇప్పుడూ అంతేనని చెప్పుకొచ్చాడు. సిల్క్ కి గల ఆస్తులను కబ్జా చేయడంలో రాధాకృష్ణ రోల్ చాలా పెద్దదని వాపోయాడు. ఇక ఎందరో నటులతో నటించినా, తన అక్క చనిపోయినపుడు ఒక్క అర్జున్ తప్ప ఎవరూ రాలేదని , ఇదేమి ఇండస్ట్రీ అని వాపోయాడు. సిల్క్ మరణం పై మిస్టరీ ఛేదించడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని, కనీసం ఇండస్ట్రీలో ఎవరూ ఈ కేసు గురించి పట్టించుకోలేదని వాపోయాడు.