ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఉగాది నుండి ఈ 4 రాశుల వారికీ అదృష్టం,డబ్బు వద్దన్నా వెతుక్కుంటూ వస్తాయి
మార్చి 25 శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సరం ఉగాది రోజున ప్రతి ఒక్కరు వారి జాతకం ఎలా ఉందో చూసుకోవటం పరిపాటే. ఆదాయం,ఖర్చు,రాజపూజ్యం,అవమానం ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు ఉగాది రోజు పంచాంగంలో చూసుకుంటారు. ఈ విధంగా రాశి ఫలాలు చూసుకొని ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో ముఖ్యంగా 4 రాశుల వారికి బాగా కలిసే వస్తుంది. ఆ రాశులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి
అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం- 14, వ్యయం -14, రాజ్యపూజ్యం-3, అవమానం-6. ఈ వికారినామ సంవత్సరం మేషరాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని ఆటంకాలు ఎదురైనా సక్సెస్ గా ముందడుగు వేస్తారు. ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తె చేసే ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధిస్తారు. వృతి,ఉద్యోగం చేసేవారికి అనుకోని శుభ పరిణామాలు అవుతాయి. ఈ రాశివారికి గురుడు అనుగ్రహం ఉండుట వలన మంచి ఫలితాలు వస్తాయి. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు,బంధువుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. వీరు ఆరోగ్యం విషయంలోనూ,ప్రయాణాల విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మిధున రాశి
మృగశిర-3, 4 పాదాలు, ఆరుద్ర-1, 2, 3, 4 పాదాలు, పునర్వసు-1, 2, 3 పాదాలు. ఆదాయం-11, వ్యయం -5, రాజ్యపూజ్యం- 2, అవమానం-2. ఈ రాశివారికి వికారినామ సంవత్సర ప్రారంభం చాలా బాగుంటుంది. ఈ రాశివారు సాహసోపేతమైన పనులను చేస్తారు. ఈ రాశివారు ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. కొన్ని సందర్భాలలో పనులు కొంత ఆలస్యంగా జరిగిన కంగారు పడకుండా నిదానంగా ఉంటారు. కుటుంబంలో వివాదాలు ఏర్పడిన ఈ రాశివారు తమ చతురతతో వెంటనే పరిష్కారం చేసేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్తజాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆకస్మిక మార్పుల కారణంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి కాలం. కోరుకున్న చోటుకి ప్రమోషన్స్ వస్తాయి.
కుంభ రాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం -5, వ్యయం -2, రాజ్యపూజ్యం-2, అవమానం-4. కుంభ రాశి వారు సంతానం విషయాలలో ఆరాటపడుతూ ఉంటారు. ఆ కోరిక ఈ సంవత్సరం తీరుతుంది. ఈ రాశివారిని నలుగురు గౌరవిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా మాటకు విలువ కూడా పెరుగుతుంది. వీరి అడుగులు ఎప్పుడు విజయం వైపే ఉంటాయి. భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచితే శుభపరిణామాలు జరుగుతాయి. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. ఈ రాశివారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది.
మీన రాశి
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం -2, వ్యయం -8, రాజ్యపూజ్యం-1, అవమానం-7. మీన రాశివారు ఈ సంవత్సరం నిర్ణయాలను చాలా త్వరగా తీసుకుంటారు. ఏ కార్యక్రమం తలపెట్టిన విజయవంతం అవుతుంది. జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆశించిన లాభాలు, ఆర్ధిక అభివృద్ధి, గృహ నిర్మాణం జరుగుతాయి . సంతానం లేని వారికి సంతానం, వివాహం కాకుండా ఉన్నవారికి వివాహం జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సంఘంలో గొరవ మర్యాదలు పెరుగుతాయి.