ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ ఎంతోతేలిస్తే షాకవుతారు
ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను చాలామంది హీరోయిన్స్ అమలు చేసేస్తున్నారు. తమకు డిమాండ్ ఉండగానే కాసిన్ని డబ్బులు వెనకేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. హిట్ తర్వాత రేట్లు కూడా పెంచి,తమ రేంజ్ ఏమిటి చూపిస్తున్నారు. ఈ విధంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ భారీగానే ఉంటున్నాయి.
కొత్త హీరోయిన్స్ సైతం ఇదే పంధా సాగిస్తున్నారు. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఎవరంటే,నయనతార అని చెప్పాలి. బాలయ్య జయసింహ మూవీలో రెండుకోట్ల 60లక్షలు తీసుకున్న ఈమె, ప్రస్తుతం చిరంజీవితో సైరా మూవీలో నటిస్తున్నందుకు కూడా ఎక్కువే ఆఫర్ చేశారట.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ సీన్ రివర్స్ లో ఉంది. ఈమె మొదట్లో కోటి డిమాండ్ ఉన్నా ఆతర్వాత 80కి తగ్గింది. ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తూ 60లక్షలు తీసుకుంటోందట. ఎప్పుడు పెంచాలో కాదు ఎప్పుడు రెమ్యునరేషన్ తగ్గించాలో ఈ అమ్మడికి బానే తెల్సు.
ఇక పెళ్లయ్యాక స్టార్స్ పక్కన నటించడం తగ్గించిన సమంత స్టార్స్ తో నటించే ఛాన్స్ వస్తే కోటికి పైనే డిమాండ్ చేస్తోంది.
కోటికి కన్నా తక్కువ రేటు పలికే కీర్తి సురేష్ మహానటి కోసం కోటికిపైనే తీసుకుందని టాక్.
ఇక రాశికన్నా 40నుంచి 50లక్షలు తీసుకొంటోంది.
మరి కుర్ర హీరోలతో నటించడానికి కాజల్, తమన్నా లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటూ కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన నటించినందుకు తమన్నాకు కోటి 60లక్షలు ముట్టాయట.
కాగా బెల్లంకొండ సురేష్ సరసన ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్న కాజల్ కి హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఒక్కో మూవీకి కోటిన్నరపైనే ముట్టడంతో మరి ఇలాంటి ఛాన్స్ మిస్ ఎలా మిస్ చేసుకుంటుంది. ఇక ఖైదీ నెంబర్ 150 మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు కూడా ఈ అమ్మడు భారీగానే తీసుకుందట.
ఇక కెరీర్ మొదట్లో వరుస ప్లాప్ లు అందుకున్న పూజా హెగ్డే ఆతరువాత దువ్వాడ జగన్నాధంతో హిట్ అందుకుంది. అరవింద సమేతతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని,ప్రస్తుతం మహర్షి మూవీలో మహేష్ తో ఆలాగే ప్రభాస్ తో ఓ మూవీలో జతకడుతున్న ఈ భామ బాగానే వెనకేసుకుందన్న టాక్ వస్తోంది.
మొదట్లో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న గోవా బ్యూటీ ఇలియానా దారిలో ఆతర్వాత చాలామంది నడిచారు. అయితే ఒక్క సినిమా ఛాన్స్ కూడా తెలుగులో ప్రస్తుతం లేకున్నా సరే, ఈ మధ్య రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని కోసం జోడీకట్టి కోటికి ఏమాత్రం వెనక్కి తగ్గలేదట.
భరత్ అను నేనుతో ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ మహేష్ బాబుతో రొమాన్స్ చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. వెంటనే వినయ విధేయ రామలో ఒప్పుకుని, చెర్రీతో జతకట్టి 50లక్షలు దక్కించుకుంది.
ఇక ఆడియన్స్ మెప్పు పొందాలంటే గ్లామర్ తో పనిలేదని చాటిచెప్పిన హీరోయిన్ సాయిపల్లవి ఫిదా సినిమాతో నిజంగానే ఫిదా చేసింది. ఆతర్వాత ఎంసిఎ వంటి వరుస హిట్స్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం శర్వానంద్ సరసన రెండు మూవీస్ చేస్తోంది. ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నా, కథ, కథనం నచ్చితేనే ఒకే చేస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు కోటి తీసుకుంటోంది.
చలో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక పేరు గీత గోవిందం మూవీతో టాప్ రేంజ్ కి వెళ్ళింది. చేసింది మూడు సినిమాలే కావచ్చు గోల్డెన్ లెగ్ గా ముద్ర వేసుకున్న ఈమెకు కోటిపైనే ఇస్తున్నారట.