Movies

కార్తీక దీపం సీరియల్ లో నటించిన శ్రీలత బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

కార్తీక దీపం సీరియల్ చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్ లో మౌనిక ఫ్రెండ్ గా కనిపిస్తున్న శ్రీలత అసలు పేరు యశ్వి కనకాల. ఈ సీరియల్ లో దీప, కార్తీక విడిపోవడంతో దీపను ఎలాగైనా చంపి కార్తీక్ కి మౌనికకు పెళ్ళి చేయాలని శ్రీలత అనుకుంటుంది. విజయవాడలో పుట్టిపెరిగిన శ్రీలత బరువు 58కిలోలు. ఈమె తల్లిపేరు సరోజ. విజయవాడ లో టెన్త్ వరకూ చదువుకుంది. గుంటూరు శ్రీమేధలో సీఏ పూర్తిచేసి,ఆతర్వాత ఎంబీఏ చేసింది. మొదట్లో స్టార్ మాలో ప్రసారమైన పెళ్లిచూపులు అనే రియాల్టీ షోలో పాల్గొంది.

శ్రీలత పనిచేసే స్పెస్అ కాడెమీ వెబ్ డిజైనింగ్,ఫిలిం మేకింగ్,విజువల్ ఎఫెక్ట్స్,యానిమేషన్ అకాడెమీగా పేరుపొందింది. తెలుగు షార్ట్ ఫిలిం లో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తోంది. ఆర్ ఎక్స్ 100ఈమె ఫేవరేట్ మూవీ. క్రికెట్ టీమ్ లో చెన్నై సూపర్ టీమ్ అంటే ఈమెకు చాలా ఇష్టం. ఇక ఈమె బెస్ట్ ఫ్రెండ్ శ్రేయ. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి శ్రీలత పెద్ద అభిమాని. అందుకే కౌశల్ విన్నర్ గా నిలవడానికి తనవంతు కృషి చేసిన వాళ్లలో ఈమె కూడా ఒకరు.

శ్రీలత 2018ఆగస్టు 13వతేదీన సిమా అవార్డ్స్ లో అవార్డు అందుకుంది. అదే ఏడాది ఓ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. నటన మీద ఆసక్తి గల వారికి కామెడీ ,ఎమోషన్,లవ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తోంది. డైరెక్టర్ రాజ్ విరాట్ శ్రీలతకు మంచి ఫ్రెండ్. ఫ్రెండ్స్ తో అరకువేలీలో ఎంజాయ్ చేసింది. వీకెండ్ లో రిషికొండ బీచ్ కి వెళ్లడం అలవాటు. నందితా జీవన్, పావని బొల్లా,వైష్ణవి లు ఫామిలీ ఫ్రెండ్స్ అని చెబుతుంది. ది కేండిల్,మానాన్న రైతు,ఉగాది పండుగ,ఆమె,నీ ఊహలే, ఈతరం హీరోలు వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈమె స్టార్ యాంకర్ సుమ కనకాలకు చెల్లి అవుతుంది. రాజీవ్ కనకాల ఈమెకు బావ అవుతాడు.