Movies

ఫెయిల్యూర్ హీరో కథలే కొత్త ఫార్ములా…!

సినిమాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంది. ఇక ఈ రోజుల్లో  యూత్ ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు కొత్త కథలు వస్తున్నాయి. ఈ కథలు కూడా కేవలం ప్లాప్ హీరోలను టార్గెట్ చేసుకుని రాసి,తెరకెక్కించడం విశేషం. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య వరుస ప్లాప్ లతో సతమవుతుంటే, తాజాగా వచ్చిన మజిలీ సినిమా హిట్ అందించింది. పెళ్లయ్యాక భార్య సమంతతో కల్సి నటించిన ఈ మూవీ హిట్ అవ్వడం ఫాన్స్ ని ఖుషి చేస్తోంది.

కలెక్షన్స్ కూడా దుమ్మురేటపుతున్నాయి. ఇక వరుస ప్లాప్ లు రుచి చూస్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ మూవీ విడుదల కావడం,మరో రెండు రోజుల్లో దీనిపైనా క్లారిటీ వచ్చేస్తుంది. మరోపక్క ప్లాప్ లు ఎదుర్కొంటున్న నేచురల్ స్టార్ నాని కూడా జెర్సీతో తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. 19వ తేదీన రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే చైతు,తేజ్,నాని ల సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మజిలీ సినిమాలో ప్రేమ విఫలమై, కెరీర్ పోగొట్టుకుని ముందుకి బానిసైన యువకుడిగా నాగ చైతన్య తన పాత్రలో జీవించాడు.

ఇక చిత్రలహరి మూవీలో హీరో సాయి ధర్మ తేజ్ కలలు కన్న ఇంజనీర్ కలలు ఎంతకీ కార్యరూపం దాల్చకపోవడంతో ఓ బార్ లో సెటిల్ అయిన యువకుడిగా దర్శనమిస్తాడు. అలాగే నాని కూడా జెర్సీ సినిమాలో క్రికెటర్ గా తన కెరీర్ పీక్ కి వెళ్తున్నప్పుడు కొన్ని కారణాలవలన దానికి దూరమై,జీవితం దెబ్బతినడంతో కొడుకు పుట్టాక అతడి కోసం లేటు వయస్సులో బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగుతాడు.

ఇలా మజిలీ,చిత్రలహరి,జెర్సీ సినిమాలు చూస్తే, హీరోలు తమ జీవితాల్లో బాగా దెబ్బతిన్న పాత్రలే పోషించారు. డబ్బుకోసం ఇబ్బంది పడే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కుటుంబ వ్యక్తులుగానే నటించారు. ఇక ఈ మూడు సినిమాల్లో అవతలి పార్ట్ నర్ ఇవతలి వాళ్ళను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్లనే వీళ్ళ జీవితాలు ఇలా అవుతాయని కూడా గమనించవచ్చు.