అకిరాను టార్చర్ చేసేది ఎవరో తెలుసా?
రాజకీయాలు వేరు,వృత్తులు వేరు అంటారు కానీ పవర్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ రెండు హోదాలు వేరైనా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఒకేలా కనిపిస్తుంది. నిజానికి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమా హీరోలకి ఫాలోయింగ్ కొంత తగ్గుతుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఇప్పుడు అతని కొడుకు అకిరాకి టార్చర్ గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ కి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇంకా ఫాలోయింగ్ పెరిగింది తప్ప తరగలేదు. ప్రత్యర్ధులుగా వైసీపీ, టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా విభేదిస్తున్న ప్పటికీ అతను ప్రస్తుతం జీరో బడ్జెట్ పోలిటిక్స్ చేసిన విధానంపై మాత్రం అందరూ గొప్పగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో అతనిని ఏపీ ముఖ్యమంత్రిగా చూడొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్న అకిరాని టాలీవుడ్ లో పవన్ వారసుడుగా, హీరోగా చూడాలని పవన్ ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం టీనేజ్ లో వున్నా అకిరా ఇలా తండ్రి నుంచి వచ్చే ఫాలోయింగ్ ఇష్టపడకుండా తనకంటూ ఐడెంటిటీ కావాలని ఆశిస్తున్నాడు. అయిన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో ఒక రూపంలో అకిరాని సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తూ అతనికి అనవసరమైన ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పవన్ ఫాలోయింగ్ ఇప్పుడు అకిరాకి వ్యక్తిగతంగా టార్చర్ గా మారిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.