PoliticsUncategorized

జగన్ సక్సెస్ కి ఆ నలుగురు…. వారు ఎవరో చూడండి

రాజకీయాల్లోకి వచ్చేదే పదవి కోసం. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండేది అందుకే కదా. అయితే పదవిలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించామన్నదే ప్రజలు చూస్తారు. పదవులకోసం రాజకీయాల్లో లేమని చెప్పడం వింటూంటాం. కానీ సీఎం కుర్చీ నా కల ,నా లక్ష్యం అని పబ్లిక్ గా ప్రకటించి, దేశ రాజకీయాల్లోనే సంచలనంగా నిల్చిన వ్యక్తి ఎవరంటే  వైఎస్ జగన్ అని చెప్పాలి. అంతటితో ఆగలేదు. ఏకంగా 30ఏళ్లపాటు పాలన చేయాలన్నది కూడా కోరికగా ఉందట. ఇలా ప్రకటించడం కూడా ఓ ఛాలెంజ్ అని చెప్పాలి. 2014ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్ 2019ఎన్నికల కోసం నిరంతరం శ్రమించారు.

గడప గడపకు కార్యక్రమంతో పార్టీ శ్రేణులను ప్రజల మధ్య తిప్పారు. అయన అయితే ఏకంగా రాష్ట్రమంతటా పాదయాత్ర చేసారు. మొత్తం మీద ఎన్నికలు ముగిసాయి. ఏప్రియల్ 11న పోలింగ్ ముగియగా, మే23న లెక్కింపు చేపడతారు. అయితే కాబోయే సీఎం జగన్ అంటూ సర్వత్రా విశ్లేషణలు,సర్వేలు చాటిచెబుతున్నాయి. అయితే జగన్ కి ఇంతలా సక్సెస్ రేటు రావడానికి నలుగురు కీలక పాత్ర వహించారు. 

జివిడి కృష్ణ మోహన్, రఘురాం,కె ఎన్ ఆర్, అవినాష్ లు జగన్ కి బాగా సాయపడ్డారట. ఇందులో కృష్ణమోహన్ మొత్తం మీడియా అంశాలు చూసారు. మీడియా విశ్లేషణ,ఏ అంశాలను జగన్ ప్రస్తావించాలి, వంటి అంశాలన్నీ చూసారు. పాదయాత్ర,ఎన్నికల ప్రచారం అంతా  రఘురాం చూసారు. గతంలో ఓదార్పు యాత్ర, షర్మిల పాదయాత్ర, విజయమ్మ పర్యటన ఇవన్నీ ఈయన పర్యవేక్షించారు. ఇక జగన్ వ్యక్తిగత సిబ్బంది కె ఎన్ ఆర్ ఏ చిన్న వ్యవహారమైనా చక్కబెడుతూ వచ్చారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ వ్యవహారాలు చూసిన అవినాష్ ఇప్పుడు జగన్ ఎన్నికల వ్యవహారమంతా నిర్వహించారు.