అంబానీ ఇంట్లో పనిమనిషి లైఫ్ ఎలా ఉంటుందో చూడండి
పెద్ద ఇల్లు లేకపోయినా పర్వాలేదు గానీ, గొప్పింటి ఇంట్లో పనిచేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఎంతోవిలువ ఉంటుందని భావిస్తారు. జీతాలు బాగానే వస్తాయని, ఆలనా పాలనా చూస్తారని అనుకుంటారు. ఇక అంబానీ ఇంట్లో పనిచేస్తే ఎలా ఉంటుందో,ఎలా చూసుకుంటారో వేరే చెప్పక్కర్లేదు. ముఖేష్ అంబానీ కట్టిన అందమైన ఇంటివిలువ అక్షరాలా 7వేలకోట్లు. ప్రపంచంలోనే అంత్యంత ఖరీదైన ఇల్లు ఇది. మహారాజు భవంతి మాదిరిగా ఇందులో సకల సదుపాయాలు ఉంటాయి.
మొత్తం 27అంతస్తులతో నిర్మించిన అంబానీ ఇంట్లో జిమ్,స్పా,స్విమ్మింగ్ పూల్,మూడు హెలీపాడ్స్,సినిమాహాలు,పెద్ద గార్డెన్ వంటివన్నీ ఉన్నాయి. ఆరు అంతస్తుల్లో కార్లను పార్కింగ్ చేయడానికే ఉపయోగిస్తారు. ఇక ఈ ఇంట్లో పనివాళ్ళు ఎందరో తెలుసా? అక్షరాలా 600మంది. సెక్యూరిటీ, వంట చేసేవాళ్ళు, క్లినింగ్ సిబ్బంది ఇలా వివిధ రకాల పనివాళ్ళు ఉంటారు. షిఫ్ట్ ల వారీగా పనిచేస్తారు. అయితే ఆ ఇంట్లో పనివాళ్లుగా చేరాలంటే చాలా తతంగం ఉంటుంది. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే ఎలాంటి ఇంటర్యూ చేస్తారో అంతలా ప్రాసెస్ ఉంటుంది. ఇలా అన్ని టెస్టులు పాసైతేనే ముఖేష్ అంబానీ ఇంట్లోకి పనివాళ్లుగా చేరడానికి వీలుగా ఉంటుంది.
ఇక ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ టీమ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరి ఫ్లోర్ పని ఆ టీమ్ చూసుకుంటుంది. టీమ్ లో ఎవరెవరికి ఏ పని పురమాయించాలో టీమ్ లీడరు చూస్తాడు. ఇక జీతాల విషయానికి వస్తే గతంలో ఆరువేలు ఉండే జీతాలు ఇప్పుడు లక్షా50వేలనుంచి 2లక్షల దాకా ఉన్నాయి. పనివాళ్లలో ఒక్కో ఇంటిలో వారి పిల్లల్లో ఒకరికి అమెరికా వెళ్లి చదువుకోడానికి అయ్యే ఖర్చుని అంబానీయే భరిస్తారట. పనివాళ్ళతో అంబానీ మర్యాదగా, ప్రేమతో మాట్లాడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పనివాళ్ళలా కాకుండా సొంత ఫ్యామిలీలా భావిస్తారు.