సుమంత్ పేరుతో అక్కినేని వీలునామా – మరి నాగ్ కోపంతో ఏంచేశాడో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యామిలీతో పోలిస్తే అక్కినేని ఫ్యామిలీలో ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి కష్టపడ్డా ఫలితం దక్కక ఇప్పటికీ హిట్ కోసం దండయాత్రలు చేస్తున్నవాళ్లు బానే ఉన్నారు. సుశాంత్ కి వయస్సున్నా క్లిక్ కావడం లేదు. ఇక సుమంత్ అయితే కీర్తి రెడ్డితో పెళ్లయి రెండేళ్లకే విడిపోయి,పాపం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. 1975ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో సురేంద్ర యార్లగడ్డ, అక్కినేని సత్యవతిలకు సుమంత్ జన్మించాడు. అక్కినేని పెద్దకూతురు సత్యవతి సుమంత్ పుట్టిన కొన్నాళ్లకే అమెరికా వెళ్లిపోయారు. సుమంత్ ఇక్కడే ఉండిపోయాడు. దీంతో అక్కినేని తన కన్నా కొడుకు కన్నా ఎక్కువగా సుమంత్ ని చూసుకున్నాడు.
మనవడి రూపంలో తాతయ్య దగ్గర కొడుకులా పెరిగాడు. ఇక సత్యవతి మరణించడంతో సుమంత్ అంటే అక్కినేనికి మరింత ప్రేమ ఏర్పడింది. సత్యం మూవీతో పెద్ద హిట్ కొట్టిన సుమంత్ కి మళ్ళీ అలాంటి హిట్ దాఖలాలే లేవు. మధుమాసం లాంటి హిట్స్ వచ్చినా అతడి కెరీర్ ని మలుపు తిప్పలేకపోయాయి. ఇంతలో పెళ్లి,భార్య కీర్తి రెడ్డి రెండేళ్లు కాపురం చేసి ఇగో ప్రాబ్లమ్ వలన విడిపోయింది.
ఓ పక్క తల్లి మరణం,మరోపక్క భార్య విడాకులు కారణంగా మళ్ళీ సుమంత్ కి తాతయ్య దిక్కుగా మారాడు. తన తర్వాత మనవడి పరిస్థితి ఏమిటని భావించిన అక్కినేని నాగేశ్వరరావు బంజారా హిల్స్ లోని ఏ ఎన్ ఆర్ సెంటర్ ని సుమంత్ కి రాసేసి వెళ్లిపోయారు. ఇప్పుడు దీనివిలువ అక్షరాలా వందకోట్లు. పుడితే ఇలాంటి ఇంట్లో మనవడిలా పుట్టాలిరా అనే విధంగా సుమంత్ వ్యవహారం ఉంది. అయితే ఇంతమంది కుటుంబ సభ్యులుండగా కూతురి బిడ్డకు ఇంతపెద్ద ఆస్తి ఇవ్వడమేమిటంటూ నాగార్జున తదితరులు భగ్గుమన్నారట. అయితే ఎవరేమనుకున్నా సరే , ఆ ఆస్తి సుమంత్ కే దక్కాలని నాగ్ తో సహా ఇతర కుటుంబ సభ్యులకు అక్కినేని తెగేసి చెప్పేసారు