సమీరా రెడ్డి జీవితం ఎందుకు రివర్స్ అయిందో తెలుసా?
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి ఆఫర్లు కోల్పోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఓ బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానంటూ ఆమె పలు సార్లు గతంలో చెప్పుకొచ్చిన ఈమె బాబు పుట్టిన కొన్ని నెలలకే రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడిందట. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్న విధంగా ఆమె ఆశలన్నీ తలకిందులు అయ్యాయి. బాబు పుట్టిన తర్వాత ఒక వ్యాది వల్ల అయిదు నెలల పాటు బెడ్ కే పరిమితం అయిపొయింది. అయిదు నెలల పాటు బయటకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే ఉండటం వల్ల చాలా లావెక్కింది. ఓ ఇంటర్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించింది.
బాబు పుట్టిన తర్వాత వర్కౌట్స్ చేసేందుకు వీలవ్వలేదు. దాంతో ఏకంగా 102 కేజీల బరువు పెరిగా. ఆ సమయంలో కొన్ని సార్లు నేనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నన్ను చూసి ఇలా అయ్యిందే ఏం అయ్యిందో అంటూ కొందరు చేసిన కామెంట్స్ నాకు చాలా బాధకు గురి చేశాయి. ఆ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. అంతేకాదు, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి’అని సమీరా వివరించింది. తన మానసిక పరిస్థితి బాగాలేదని మానసిక వైధ్యులను కూడా సంప్రదించానని సమీరా చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో వారు ఇచ్చిన సలహాలు, సూచనలు విని,వాళ్ళు చెప్పిన విధంగా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని చెప్పింది. ‘ప్రస్తుతం నేను రెండవ సారి గర్బవతిని అయ్యాను. ఈ విషయాన్ని చాలా సంతోషంగా చెబుతున్నా. రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మామూలు రూపం వస్తుందని అనుకుంటున్నా. అందుకోసం ప్రయత్నిస్తాను. నా జీవితంలో మళ్లీ మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నా. సినిమాల్లోకి వచ్చి అలరించాలనే కోరిక తీరాలని ఉంది’అని సమీరా వివరించింది. .