రఘు బాబు తమ్ముడు కూడా టాలీవుడ్ నటుడే అని మీకు తెలుసా ?
తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు దశ తిరుగుతుందో తెలియదు. ప్రాప్తం బట్టి వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. హీరోగా చేద్దామని వచ్చి,విలన్ గా సెటిల్ అవుతారు. విలన్ గా చేస్తూ కొందరు హీరో అయిపోతారు. కొందరు బుల్లితెర చాలు అనుకుంటే వెండితెరను కూడా ఏలేస్తారు. మరికొందరు వెండితెరలో వెలిగిపోదామనుకుంటే బుల్లితెరకు పరిమితం అవుతారు. ఎవరి జాతకం ఎలా ఉంటుందో చెప్పలేం. గిరిబాబుకి ఎంతోఘన చరిత్ర ఉంది. ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కమెడియన్ గా ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన గిరిబాబు దర్శకుడుగా, నిర్మాతగా కూడా రాణించాడు.
భానుచందర్,సుమన్ లాంటి వాళ్లకు స్టార్ డమ్ తెచ్చాడు. కానీ కథల మీద పట్టున్నా కూడా సొంతకొడుకు బోస్ బాబుని హీరోగా నిలబెట్టలేకపోయాడు. మొదట్లో జయభేరి నిర్మాణ సంస్థను మురళీమోహన్ తో కల్సి నెలకొల్పి రెండు మూడు సినిమాలు కూడా తీశారు. అయితే ఆ సంస్థ మురళీమోహన్ చేతికి పూర్తిగా వచ్చాక విస్తృతమైంది. భవననిర్మాణ రంగంలో కూడా దూసుకెళ్లింది. మోహన్ బాబుతో రూమ్ షేర్ చేసుకుని,సూపర్ స్టార్ కృష్ణ తో 150సినిమాలు షేర్ చేసుకున్నాడు.
ఎంతోచరిత్ర గల గిరిబాబు కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రఘుబాబు సినిమాల్లో నిలదొక్కుకున్నాడు. విలన్ గా , విలన్ కమ్ కమెడియన్ గా రాణిస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అయితే అతడి తమ్ముడు బోస్ బాబు ఒకటి రెండు సినిమాలతోనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రజిత్ పేరుతొ కౌబాయ్ మూవీ గిరిబాబు డైరెక్షన్ లో బోస్ బాబుతో తీసాడు. అదేసమయంలో కొదమసింహం కూడా విడుదలవ్వడం తగిన సొమ్ములు రాక,గిరిబాబు సినిమా తక్కువకు కొన్నారట. అలా ఎంతో నష్టపోయి తొలిప్రయత్నంతో బెడిసి కొట్టింది. ఆవిధంగా బోసుబాబు హీరోగా ఎదగాల్సిన సమయంలో పెద్ద దెబ్బ పడింది. ఒకటి రెండు సినిమాలు ఆతర్వాత చేసినా అచ్చిరాలేదు. పైగా మిగిలిన నిర్మాత దర్శకులు ఎవరూ బోస్ బాబుకి ఆఫర్స్ ఇవ్వలేదు. దీంతో సీరియల్ నటుడు ప్రభాకర్ ఇచ్చిన అఫర్ తో సీరియల్స్ లో నటిస్తూ ముందుకు వెళ్ళాడు.