Politics

హీరోయిన్ మదర్ కానీ దేశంలో రాజకీయ ధనవంతురాలు… ఎవరో చూడండి

భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం లక్నో. అలాంటి చోట సామాజికవర్గ సమీకరణాలను లెక్కలోకి తీసుకుని సమాజ్ వాదీ పార్టీ వాళ్లు పూనమ్ సిన్హాను పోటీ చేయించారట. ఎస్సీ-బీఎస్పీల ఉమ్మడి అభ్యర్థి కావడంతో ఆమె ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో నుంచి ఎంపీగా పోటీలో ఉన్న పూనమ్ సిన్హా ఆస్తులు రికార్డు స్థాయిలో ఉన్నాయి. షాట్ గన్ శత్రుఘ్న సిన్హా సతీమణి, బాలీవుడ్ బుల్లెట్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా తన ఆస్తులు భారీ స్థాయిలో ఉన్నట్టు ప్రకటించారు.

వాస్తవానికి కొన్నాళ్ల కిందట వరకూ షాట్ గన్ కుటుంబం బీజేపీలో ఉంది. కమలం పార్టీలో విబేధాలతో శత్రుఘ్నసిన్హాకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆపార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ పోటీకి దిగారు. ఆయన భార్య సమాజ్ వాదీ పార్టీలో చేరి, లక్నోలో రాజ్ నాథ్ సింగ్ మీద పోటీకి దిగారు.ఐదోదశ పోలింగ్ లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ ఈ స్థాయిలో ఆస్తులను ప్రకటించలేదు.

అందుకే సోనాక్షి సిన్హా తల్లి దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా నిలుస్తున్నారు. ఐదోదశ పోలింగ్ లో భాగంగా లక్నోలో ఎన్నిక జరగబోతూ ఉంది. పూనమ్ సిన్హా మొత్తం ఆస్తుల విలువ 193 కోట్ల రూపాయలు. ఐదోదశలో పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థుల కంటే పూనమ్ సిన్హా రిచెస్ట్ పొలిటీషియన్ గా నమోదైంది.