Politics

టీవీ 9 లో ఏమి జరుగుతుంది ?

తెలుగునాట సంచలన న్యూస్ కి కేరాఫ్ ఎడ్రెస్,ట్రెండ్ సెట్టర్ గా నిల్చిన ఛానెల్ టీవీ 9 ఇప్పుడున్న అనేకానేక ఛానెళ్లకు మార్గదర్శకం అని చెప్పాలి.అలాంటి ఛానెల్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి చాలా కాలంగా టీవీ 9 అమ్మకం అన్నది వార్తల్లో నలుగుతోంది. మొత్తానికి గత ఏడాది కార్యరూపం దాల్చింది. అగ్రిమెంట్లు, అమ్మకాలు, భాగస్వామ్య లెక్కలు, లావాదేవీలు తెలియకపోయినా, మొత్తానికి మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డిల చేతికి టీవీ9 వచ్చేసింది. అయితే కార్పొరేట్ వ్యవహారాలు, లీగల్ ప్రొసీడింగ్స్ సరేసరి. ఈ పరిస్థితిల్లో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో టీవీ 9 ఎడిటోరియల్ బోర్డు మీద కాస్త మేనేజ్ మెంట్ వత్తిడి పెరిగిందట. ఓ పార్టీకి కాస్త ఎక్కువ అనుకూలంగా వుండాలని ఒత్తిడి చేసినట్లు, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో మార్పులకు ప్రయత్నించినట్లు టాక్.

అయితే ఈ విషయంలో టీవీ 9లో మైనర్ వాటాలు వున్న వారు కోర్టును కూడా అప్రోచ్ అయ్యారట. ఇక లేటెస్ట్ గా నటుడు శివాజీ కూడా కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. టీవీ9 అమ్మకం అగ్రిమెంట్ చెల్లదని, షేర్ హోల్డర్ గా తనకు తెలియకుండా అంతా జరిగిపోయిందని శివాజీ వాదిస్తున్నారు. లేటెస్ట్ గా జర్నలిస్ట్ సర్కిళ్లలో టీవీ 9 ఎడిటోరియల్ బోర్డుకు కొత్త మేనేజ్ మెంట్ కు అంతగా పొసగడం లేదని వినిపిస్తోంది. టీవీ 9 నుంచి, దానికి జన్మనిచ్చిన రవిప్రకాష్ తప్పుకుంటారా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి రవిప్రకాష్ కు కూడా 12శాతం షేర్ లు వున్నాయని తెలుస్తోంది. కొత్త మేనేజ్ మెంట్ కు. ఇన్నాళ్లు వున్న ఎడిటోరియల్ బోర్డు అధినేతలకు మధ్య ఎడం పెరుగుతున్నట్లు టాక్ రావడంతో అసలు ఇప్పుడేం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.