Movies

అప్పుడు ఆది, ఇప్పుడు అల్లరి నరేష్‌ అంతేనా?

ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి,కామెడీ చిత్రాలతో స్టార్ కమెడియన్ గా ఎదిగిన అల్లరి నరేష్ కి ఇప్పుడు వస్తున్న పాత్రలు అయ్యో పాపం అనేలా ఉన్నాయి. హీరోగా తీస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో ఇక క్యారెక్టర్ యాక్టర్ గా పాత్రలు వేస్తూ నెట్టుకొస్తున్నాడు. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న తాజా మూవీ ‘మహర్షి’లో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర విషయానికి వస్తే, ఈ పాత్రను ప్రీ క్లైమాక్స్‌లో లేపేస్తారని ఇంతవరకూ ప్రచారం జరిగింది. రంగస్థలం’ సినిమాలో కుమార్‌బాబుగా నటించిన యంగ్‌ హీరో ఆది పినిశెట్టి పాత్రను ప్రీ క్లైమాక్స్‌లో చంపేసి, సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు.

రంగస్థలం లో ఆది పినిశెట్టి చనిపోయే సీన్‌ సినిమాకి టర్నింగ్‌ పాయింట్‌. అసలు కథకు అదే కీలకం కూడా. అయితే అది ‘రంగస్థలం’ లో అలా చేస్తే, ఇప్పుడు ‘మహర్షి’ లో అల్లరి నరేష్ కూడా అలాంటి పాత్రనే పోషిస్తున్నట్టు టాక్ వచ్చింది. అయితే ‘మహర్షి’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో దిల్‌రాజు చెప్పకనే చెప్పేయడంతో కన్‌ఫామ్‌ అయ్యింది. ధియేటర్‌ నుండి చెమర్చిన కళ్లతో బయటికొస్తారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి అది, అల్లరి నరేష్‌ పాత్ర తాలూకు విషయమే అని క్లారిటీ వచ్చేసింది.ఈనెల 9న వరల్డ్ వైడ్ గా విడుదలకానున్న మహర్హికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది.

దాంతో పాటే ఫ్యాన్స్ లో  టెన్షన్‌ కూడా డబుల్ అయిపోతోంది. ఇప్పటికే ‘మహర్షి’ కథ ఇది అంటూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని కథలు నిజంగానే సినిమాకి కనెక్ట్‌ అయ్యి ఉండడంతో ఆల్రెడీ సినిమాకి సంబంధించిన కథ మొత్తం రివీల్‌ అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇక ‘మహర్షి’ యూనిట్‌లో ఏదో తెలియని టెన్షన్‌ కనిపిస్తోందన్న మాట వినవస్తోంది. పైకి కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ ఫుల్‌గా ఉన్నాయంటూనే లోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద ‘మహర్షి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.