Movies

మెగా హీరోల గడ్డం వెనుక ఉన్న అసలు కథ…???

ఇండస్టీలో కొన్ని యాదృచ్చికంగా ,మరికొన్ని కావాలని జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా జరిగినా, ఎంచుకునే చేసినా ఏమీ అనలేం కదా. అయితే జోరుగా చర్చ మాత్రం నడుస్తుంది. ఇప్పుడు మెగా హీరోల వ్యవహారం అలానే ఉంది. వరుసపెట్టి అందరూ గడ్డం సన్నివేశాలున్న సినిమాలనే ఎంచుకుంటున్నారా,కథలో భాగంగా అలా జరుగుతోందా అనేది పెద్ద చర్చ జరుగుతోంది. చిరంజీవి మొదలు వరుణ్ తేజ్ వరకూ అందరూ గడ్డం పాత్రలలో కనెక్ట్ అవుతున్నారు. గడ్డం కథలు మెగా హీరోలను వెతుకుంటూ వస్తున్నాయా అన్నట్లు ఒకరి తర్వాత ఒకరు గుబురు గెడ్డంతో కనిపిస్తున్నారు.

సైరా లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి గడ్డం పెంచితే,అదే సమయంలో రామ్ చరణ్ రంగస్థలం కోసం గడ్డం పెంచాడు. రెండేళ్ల నుంచి చిరంజీవి గడ్డం పెంచుతుంటే,చెర్రీ ఏడాది నుంచి గడ్డంతోనే దర్శమిస్తున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా గుబురు గడ్డంతో  కనిపిస్తున్నాడు. చిత్రలహరి మూవీ కోసం గడ్డం పెంచేసి,డిఫరెంట్ గా దర్శనమిచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా గడ్డం పెంచాడు. అతడు నటిస్తున్న వాల్మీకి మూవీకోసం గడ్డంతో దర్శనమిస్తున్నాడు. మొత్తానికి మెగా హీరోలంతా గడ్డం కథలలో మునిగి తేలుతున్నారు.