ప్రభాస్ కి పునర్జన్మ… షాకిస్తున్న సాహో స్టోరీ
ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీతో ఏకంగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్,బాలీవుడ్ కి ధీటైన హీరోగా ఎదిగాడు. ఇక తదుపరి మూవీ కూడా అదే రేంజ్ లో ఉండాలన్న ఉద్దేశ్యంతో 200కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ సాహు ని నిర్మిస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసున్న ఈ మూవీ గురించి నేషనల్ మీడియాలో సెన్షేషనల్ కథనాలు వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని భావిస్తున్న సాహు మూవీ గురించి అసలు కథ ఎలా ఉంటుందో కూడా అసలు యూనిట్ ఇప్పటివరకూ బయట పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రభాస్ వజ్రాల దొంగగా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఇందులోని యాక్షన్ సీన్స్ ,ఛేజింగ్ దృశ్యాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే యాక్షన్ సన్నివేశాలు కాకుండా బలమైన కథనంతో ఈ సినిమా తీస్తున్నట్లు టాక్.
పునర్జన్మ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్య పరిచేలా ఈ సినిమా ఉంటుందని వినిపిస్తోంది. మరణించి మళ్ళీ జన్మించి ప్రతీకారం తీర్చుకోడానికి ప్రభాస్ ప్రయతించడమే సాహూ మూవీలో ప్రధాన అంశగా వార్తలు వస్తున్నాయి. ప్రతీకార నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా కథ,కథనం గురించి విడుదలకు ముందు చిత్ర బృందం చెబుతుందా లేక సస్పెన్స్ కొనసాగిస్తుందా అనేది అర్ధం కావడం లేదు. అసలు ఈ మూవీ ఆ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.