Movies

రేంజ్ పెంచుకుంటున్న తెలుగు హీరోలు

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తమ మార్కెట్ పెంచుకోవాలని, దేశవ్యాప్తంగా జెండా ఎగరేయాలని మన తెలుగు హీరోలు బాగానే ట్రై చేస్తున్నారు. పరభాషా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా యూనివర్సల్ కథల వైపు అడుగులు వేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదలు బన్నీ వరకూ అందరూ ఇదే పనిలో పడ్డారు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో మళయాళ రంగంలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడి సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తూ మల్లు అర్జున్ గా ఫాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక హిందీ సినిమాల్లో నటించేందుకు ట్రై చేస్తున్నాడు. స్పైడర్ మూవీతో తమిళంలోకి మహేష్ ఎంటర్ అవ్వగా, తెలుగు,తమిళ,మళయాళ, హిందీ భాషల్లోకి సాహు తో ప్రభాస్ ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇన్ని భాషల్లో సాహు రూపొందుతోంది. 

ఇక రామ్ చరణ్ బాలీవుడ్ లోకి జంజీర్ తో వెళ్ళాడు. ఇక రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి తమిళ,మళయాళ,హిందీ మార్కెట్స్ లోకి అడుగుపెడ్తున్నాడు. ఆవిధంగా పరభాషల్లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీతోనే వెళుతున్నాడు. కుర్ర హీరోలు కూడా అదే బాట పడుతున్నారు. హీరో శర్వానంద్ డిఫరెంట్ మూవీస్ తో తెలుగులో దూసుకెళ్తూ, గతంలో కోలీవుడ్ కి వెళ్లి, ఇప్పుడు తమిళంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అలాగే నోటా మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తమిళ్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాడు. డియర్ కామ్రేడ్ మూవీని తమిళంలో విడుదల చేయబోతున్నాడు. 

ఇక ఆర్ ఎక్స్ 100తో ఎదిగిన కార్తికేయ కూడా తమిళ మార్కెట్ వైపు మళ్ళాడు. తమిళంలో నటించే ఆ మూవీ తెలుగులో కూడా రాబోతోంది. కాగా తమిళ బ్రదర్స్ సూర్య,కార్తీ తెలుగులో బానే మార్కెట్ సంపాందించుకున్నప్పటికీ తమిళంలో వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగైదు ప్లాప్ లతో ఒకరిని మరొకరు మించిపోయారు. సూర్య హీరోగా సింగం టు తర్వాత 5సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరో రెండు సినిమాల్లో స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇచ్చిన బిగ్ హిట్ పడలేదు. ఇక రాజకీయ నేపధ్యం గల ఓ సినిమా తెలుగు,తమిళ భాషల్లో చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోంది. ఇక అన్నను మించిన తమ్ముడిగా కార్తీకి ఆరు ప్లాప్ లు వచ్చాయి. ప్రస్తుతం ఖైదీ అనే మూవీలో నటిస్తున్నాడు.