ఈ ఒక్క హీరో రెమ్యూనరేషన్ తో తెలుగులో 100 సినిమాలు తీయవచ్చు
Robert Downey జూనియర్ ఐరెన్ మేన్ గా కీలక పాత్ర పోషించిన ఎవెంజర్స్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాను సక్సెస్ బాట పట్టించాయని అంటున్నారు. Robert Downey చూపిన నటనకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. అతడి నటనను చూసి జనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక Robert Downey కామిక్ పాత్రలతో ఆకట్టుకుని ఎవెంజర్స్ సినిమాకు ఎంపికయ్యాక భావోద్వేగాన్ని పండించాడు. ఆడియన్స్ గుండెలు పగిలేలా తన నటనతో కట్టిపడేసాడు.
రెమ్యునరేషన్ విషయానికి వస్తే,దాదాపు 75మిలియన్ డాలర్స్ ని అంటే మన భారతీయ కరెన్సీలో 524కోట్ల రూపాయలను చెల్లించినట్టు చెబుతున్నారు.అలాగే గతంలో విడుదలైన ఈవెంజర్స్ ప్రతిఫలాన్ని పొందే హక్కులు కూడా Robert Downey కి దఖలు పరిచినట్లు చెబుతున్నారు.గతంలో స్పైడర్ మేన్ సినిమా చేసిన సమయంలో మూడు రోజులు పనిచేసాడు. అయితే రోజుకి 5మిలియన్ డాలర్స్ అందుకున్నాడు. ఇక ఎవెంజర్స్ సక్సెస్ తర్వాత రోజుకి 20మిలియన్ డాలర్స్ అందుకుంటున్నాడట. అయితే ఇలా హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకుని కొద్దిమందిలో Robert Downey ఒకడిగా నిలవడం గ్రేట్ అంటున్నారు జనాలు.