Movies

రకుల్ కన్నా టబూ యే బ్యూటీ – ఆ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు

కొందరు హీరోయిన్స్ వయస్సు మీద పడినా యంగ్ అండ్ ఎనర్జటిక్ గా కనిపిస్తారు. ఒకప్పుడు తన అందం,అభినయంతో స్టార్ హీరోయిన్ గా రాణించిన బాలీవుడ్ భామ టబు 47 ఏళ్ళ వయసొచ్చినా కూడా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి సైతం దడ పుట్టించేంత అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది. అవును తాజాగా ఓ రియాలిటీ షోకి టబూ, రకుల్ వచ్చారు. వీరిద్దరూ అజయ్ దేవగన్ తో కలిసి ఓ చిత్రంలో సందడి చేయనున్నారు. అందుకే ఈ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి ప్రేక్షకులతో పంచుకునేందుకు ఈ ముద్దుగుమ్మలిద్దరూ వచ్చారు. అయితే 28 ఏళ్ళ రకుల్ కంటే 47 ఏళ్ళ టబూ పైనే అందరి దృష్టి పడింది. టబూ బ్యూటీ సీక్రెట్స్ గురించి తన సన్నిహితుల తెలిపిన వివరాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

నిద్ర బ్యూటీ సీక్రెట్ లో కీలకం. అయితే నిద్రలేమితో చర్మంపై వృధ్దాప్య ఛాయలు త్వరగా దర్శనమిస్తాయి. తగినంత నిద్ర పోవడం టబు సీక్రెట్. తద్వారా, చర్మం తాజాగా ఉంటుంది. మెదడు ప్రశాంతపడుతుంది. స్లీప్ అనేది బ్యూటీని మెరుగుపరుస్తుంది. నిద్రపోతున్న సమయంలో చర్మానికి సరైన విధంగా రక్తప్రసరణ ఉంటుంది. శరీరం యాక్టివ్ గా ఉండడానికి నిద్ర తప్పనిసరి అని టబూ చెప్పింది. అందుకే, అందంగా ఉండాలంటే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దని అంటోంది. షూటింగ్ సమయంలో తప్ప మిగతా సమయంలో కెమికల్ కాస్మొటిక్స్ ను టబూ వాడదు. సింపుల్ గా తయారుచేసుకుని ఉపయోగించే ఇంటి చిట్కాలకే ప్రాధాన్యతనిస్తుంది. అందుకే, ఇప్పటికీ చెక్కుచెదరని సౌందర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.

పెట్రోలియం జెల్లీ అలాగే సీ సాల్ట్ కాంబినేషన్ స్క్రబ్ ను తరచూ ఉపయోగిస్తుంది. తరచూ, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయటం స్కిన్ కేర్ కు మంచిదట. ఇక ఇతర బ్యూటీ టిప్స్ ను పాటిస్తూ తగినంత నీటిని కూడా తీసుకుంటుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే చర్మసౌందర్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యమని టబూ ఔత్సాహిక నటీనటులకు సూచిస్తోంది. నీరు తక్కువైతే చర్మం డ్రై గా మారిపోయి, ముడతలు పడతాయి. వృద్ధాప్య ఛాయలు చర్మంపై కనిపించకుండా ఉండాలంటే నీటిని తగినంత తీసుకోవాలని అంటోంది. మనం తీసుకునే ఆహారం వలన మన చర్మంపై అలాగే శరీరంపై ఏ విధమైన ప్రభావం పడుతుందో మనం తెలుసుకుని, ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడద ని టబు తేల్చి చెప్పింది.

రుచి కోసం తాపత్రయపడితే అందాన్ని కోల్పోతామని అంటోంది. ఆహారనియమావళిని పాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని టబు చెప్పింది. అప్పటికీ ఇప్పటికీ అదే విధమైన సౌందర్యాన్ని మెయింటెయిన్ చేయడం సాధారణంగా సులువైన విషయం కాద ని అంటారు కానీ టాబులా అందంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాక అందుకు తగిన విధమైన జాగ్రత్తలు తీసుకుంటే చెక్కుచెదరని సౌందర్యం మీ సొంతం అవుతుందని టబు అంటోంది.