‘మన్మధుడి’ కోసం అంతమంది హీరోయిన్లు ఎందుకంటే!
‘మన్మధుడు’కు అమ్మాయిల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ మన్మధుడు అనే పేరుకు తగ్గట్లుగానే ఆయన వయసు పైబడినా హ్యాండ్‌సమ్ లుక్స్‌లో మాత్రం యంగ్ హీరోస్‌తో కాదు, కాదు, ఆయన కొడుకులతోనే పోటీ పడుతుంటాడు. ఆయన ఎవరో పేరు చెప్పకనే అర్ధం చేసుకోలేని వారేం కాదులెండి. అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్‌నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రకుల్ కాక ఈ సినిమాలో ఇంకా చాలా మంది హీరోయిన్లు మెరుపుతీగల్లా వచ్చి పోతుంటారట.
నాగార్జున సరసన ఒక్క స్టెప్పులో అయినా చిందేసేందుకు హీరోయిన్లు ఎంతగా పోటీ పడతారో ‘కింగ్’ సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఏకంగా ఏడెనిమిది మంది ముద్దుగుమ్మలు ఒకే ఒక్క పాటలో నాగ్ పక్కన ఫుల్ లెవల్ ఎనర్జీతో హాట్ హాట్ స్టెప్పులు ఇరగదీసేశారు. అలాగే మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘మన్మధుడు 2’ కోసం నాగ్ హీరోయిన్లు హాట్ హాట్‌గా చర్చల్లో నిలిచారు. ఈ సినిమాలో ఇప్పటికే సమంత ఓ గెస్ట్ రోల్ పోషిస్తోంది.
బెంగుళూర్ బ్యూటీ అక్షర గౌడ్ ఇంకో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. తాజాగా కీర్తిసురేష్ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఎంపికైందనే సమాచారమ్ ఉంది. లేటెస్ట్ సమాచారమ్ ప్రకారం మరి కొంతమంది ముద్దుగుమ్మలు కూడా ‘మన్మధుడు’ కోసం రెడీగా ఉన్నారనీ తెలుస్తోంది. ఆ లిస్టులో ‘మన్మధుడు’ హీరోయిన్ సోనాలీ పేరు కూడా పరిశీలనలో ఉందట. ‘కింగ్’లో అంతమంది హీరోయిన్స్‌ని ఓ సాంగ్ కోసం తీసుకొస్తే, ఈ ‘మన్మధుడు 2’ కోసం వచ్చే ముద్దుగుమ్మలు ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఒక్కో సీన్ కోసం ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇవ్వనున్నారట. మొత్తానికి లేటు వయసులోనూ నాగార్జున మన్మధుడు సార్ధక నామధేయుడనిపించుకోవడం విశేషం.