Movies

సుడిగాలి సుధీర్ బ్రదర్ రోహన్ గురించి మీకు తెలియని విషయాలు

 జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కమెడియన్ గా చేస్తున్న సుధీర్  బ్రదర్ రోహన్ కు అనసూయ యాంకరింగ్ బాగా నచ్చుతుంది. రేష్మితో పోలిస్తే అనసూయకు ఎక్కువ మార్కులు వేస్తాడు. అలాగే నాగబాబు జడ్జిమెంట్ కంటే రోజా జడ్జిమెంట్ ఎక్కువ ఇష్టమట. యితడు బర్గర్ కన్నా పిజ్జాకు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. డిఫరెంట్ గా ఉండే ఇతడికి మహేష్ బాబు నటించిన మురారి సినిమా బాగా నచ్చేసిందట. రియల్ లైఫ్ లో రోమన్ రింగ్స్ బాక్సింగ్ అంటే ఇష్టపడే రోహన్ నిజానికి టామ్ & జెర్రీలో జెర్రీనే ఎక్కువగా లైక్ చేస్తాడు. సుడిగాలి సుధీర్ ని మెజీషియన్ కంటే యాక్టర్ గా చూడడమే నచ్చుతుందట. అంతేకాదు సోదరి శ్వేత కన్నా, బ్రదర్ సుధీర్ తోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. తన సీక్రెట్స్ ని సుధీర్ తోనే ఎక్కువగా షేర్ చేసుకుంటాడు. విజయవాడ తనకు హార్ట్ అయితే,హైదరాబాద్ తన బ్రెయిన్ అని రోహన్ అంటున్నాడు.

రీసెంట్ గా ఈటీవీలో వచ్చిన ఉగాది అల్లుళ్ళు షో కంటే సుడిగాలి సుధీర్ పెళ్లిగోల అనే షో బాగుందని రోహన్ అంటాడు. ఇక సుధీర్ కన్నా ప్రదీప్ ముందుగా మేరేజ్ చేసుకుంటాడట. ఈ ఏడాది చివరిలో గానీ, 2021లో గానీ సుధీర్ పెళ్లి జరుగుతుందని రోహన్ అంటున్నాడు. సుధీర్ కామెడీ కంటే బ్రహ్మానందం కామెడీ ఎక్కువగా ఇష్టపడతానని రోహన్ అంటున్నాడు. ఢీ సిరీస్ లో ఢీ టెన్ అంటే ఎక్కువ ఇష్టపడతాడట. అయితే పోవే పోరా అనే షో ఎక్కువగా వీక్షిస్తాడు. వీకెండ్ లలో నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. అతడి సామ్ సంగ్ ఫోన్ లోని ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుంటాడు.

టిడిపి అంటే ఇష్టపడే రోహన్ కి అమ్మ చేసే దోశలంటే చాలా ఇష్టమని అంటాడు. కాజల్, మెగాస్టార్, ప్రియమణి,శ్రీను,ప్రదీప్,ప్రభాస్, శేఖర్ మాస్టర్,పవన్ కళ్యాణ్,యోషిత, యష్ అంటే ఇష్టమట. మనీ ట్రాన్స్ ఫర్ కోసం ఫోన్ పే కన్నా, గూగుల్ పే ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. కాగా రమ్య చౌదరి ని ప్రేమించి, 2018లో ఆగస్టు 7న పెళ్లి చేసుకున్నాడు. జబర్దస్త్ నుంచి నాగబాబు,గెటప్ శ్రీను, అవినాష్,సన్నీ, రామ్ ప్రసాద్,హైపర్ అది,రేష్మి,రైజింగ్ రాజు,రాకేష్,దీవెన, అప్పారావు, దొరబాబు, కార్తీక్ తదితరులు హాజరయ్యారు. ఇక రోజా అయితే కొడుకు కార్తీక్,కూతురు అన్షు ని వెంటబెట్టుకుని వచ్చింది.