Devotional

వారణాసి (కాశీ) లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు

వారణాసిని భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగానే కాకుండా భూమిపై అత్యంత దిగ్భ్రాంతి కలిగించే మరియు సందర్శించదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు. ప్రతి రెండు సెకన్లకు మనకు కొత్త మరియు ఉత్తేజకరమైన ఏదో ఒక విషయం కనబడుతుందివారణాసిలో పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. వారణాసిలో గంగా నది చరిత్రఅర్థాలు, చిహ్నాలు, సంస్కృతి మరియు మతం అన్ని ఒక మేజిక్ లా ఉంటాయిఇప్పుడు వారణాసిలో ఖచ్చితంగా చూడవల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. గంగా హారతి

ఈ అద్భుతమైన నదిని చూసినప్పుడు, నదికి సొంత ఆత్మ ఉంటుందని తెలుసుకుంటాం. ఆ ప్రదేశంలో వేలాది మంది ప్రార్థనలు చేయటం, వంగి నమస్కరించటం, దీపాలను వెలిగించి గంగా నదిలో వదలటం వంటివి మంత్రముగ్దులను చేస్తాయి. ఈ విధంగా చేయటం వలన చేసిన పాపాలు పోతాయని నమ్మకం.

2. పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం లేదా సూర్యోదయం చూడటం 

వారణాసిలో గంగా నదిలో పడవలో ప్రయానించటం ఒక అద్భుతమైన అనుభవం. ముఖ్యంగా ఉదయం ప్రారంభ కాంతి స్పూర్తిని ఇస్తుంది. ఆ సమయంలో యాత్రీకుల స్నానాల సందడి మరియు పూజలు ఉంటాయి.

అయితే ఈ నది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పరిసరాలను కలిగి ఉంది. అయినా ఇప్పటికి ఈ నదిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పడవ ప్రయాణం ద్వారా ఒక ఘాట్ నుండి మరొక ఘాట్ కి వెళ్ళవచ్చుఅయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి.

3. సారనాథ్ పురావస్తు మ్యూజియం

ఈ ప్రదేశంలో బుద్దుడు నిర్వాణం పొందిన చెట్టు కూడా ఉంది.

4.మాలవ్య బ్రిడ్జ్ వీక్షణ

ఈ వంతెన నిఘాలో ఉండుట వలన ఎక్కువసేపు ఈ ప్రదేశంలో ఉండకుండా కేవలం ఫోటోలు తీసుకోని బయటకు వచ్చేస్తే మంచిది.

5.గోడలపై ఆకర్షణీయమైన గ్రాఫిటీఇవి మత పరమైన లేదా పురాణములకు సంబందించినవిగా ఉంటాయి. వీటిలో శివ,గణపతి వివిధ అవతారాలు ఉన్నాయి.

6. సాధువులు

ఇక్కడ వారు ప్రాపంచికానికి దూరంగా ఒంటరిగా ఉంటారు. ఒకరితో ఒకరికి సాహచర్యం కూడా ఉండదు. ఈ శివుని యొక్క నగరం గురించి అనేక అతీంద్రియ దృగ్విషయాలు మరియు కథలు ఉన్నాయి.
ఇక్కడ అందరూ స్నేహంగానే ఉంటారు. కానీ గెడ్డం ఉన్న ప్రతి వ్యక్తి సాధువని అనుకోకూడదు. అయితే సాధువుల ద్వారా ప్రేరణ పొంది వారి పాదాలకు మొక్కవలసిన అవసరం లేదు.