భరత్ అనే నేను Vs మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్ లో తేడా ఎన్ని కోట్లు…?
తాను స్టార్ అయినా,స్టార్ హీరోలతో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తూ,యాంటీ ఫాన్స్ హీరోగా ముద్ర పడిన సూపర్ స్టార్ మహేష్ బాబు డిఫెరెట్ మూవీస్ తో అలరిస్తున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదొక మెసేజ్ కూడా తన సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు. గత ఏడాది భరత్ అను నేను మూవీతో హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు మహర్షి తో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. పైగా మహేష్ కెరీర్ లో ఇది 25వ చిత్రం. అందానికి , అభినయానికి కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ హీరోగా ఎంతోఎత్తుకి ఎదిగాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఏకంగా ముగ్గరు బడా ప్రొడ్యూసర్స్ నిర్మించారు.
దిల్ రాజు, అశ్వినీదత్,పొట్లూరి వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన మహర్షి మూవీపై అటు ఇండస్ట్రీ, ఇటు ఫాన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కించారన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా రైతుల కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారని అంటున్నారు. ఎమోషన్స్ ఈనాటి తరానికి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. స్టూడెంట్ గా, సిఇవో గా, రైతుగా మూడు పాత్రల్లో మహేష్ ఒదిగిపోయాడని ఆడియన్స్ టాక్. ఇక వ్యూస్ ,రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ టాక్ తెచ్చుకుంది.
ఇక తొలిరోజు ఈ మూవీ గత ఏడాది ఏప్రియల్ లో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. భరత్ అనే నేను మూవీ కూడా సామాజిక కోణంతో కొరటాల శివ తెరకెక్కిస్తే,యంగ్ సీఎం గా మహేష్ అదరగొట్టాడు. దేశానికి సరైన నాయకుడు ఉంటె ఎలా అభివృద్ధి చేయవచ్చో ఈ మూవీలో మహేష్ చూపిన నటన సూపర్భ్. ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ కలిపి తొలిరోజు న ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే టాప్ రేంజ్ లో 58కోట్ల భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ రికార్డ్స్ ని మహర్షి మూవీ దాటేసింది. తొలిరోజే మహర్షి 65కోట్లకు పైగా షేర్స్ వసూలు చేసింది. పైగా బాహుబలి తర్వాత తొలిరోజు కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మహర్షి మరో రికార్డు సొంతం చేసుకుంది. తొలిరోజు కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఈ మూవీ రన్నింగ్ లో కూడా నాన్ బాహుబలి కలెక్షన్స్ లో నెంబర్ వన్ గా నిలుస్తుందని అంటున్నారు.